జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

By ramya neerukondaFirst Published Sep 27, 2018, 4:39 PM IST
Highlights

ఈ పర్యటనలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ రోజు ఉదయం ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఆ సమయంలో రేవంత్ ఇంట్లో లేరు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు.

ఈ పర్యటనలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ మంచిగా ఉంటే మళ్లీ వస్తా.. లేదంటే జైలు నుంచే నామినేషన్ వేస్తా’నని చెప్పారు. గురువారం తన ఇళ్లపై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో రేవంత్ భవిష్యత్‌ను ఊహించి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్నా.. ఎక్కడున్నా కొడంగల్ నుంచే పోటీ చేస్తానని, తనను 50 వేల మెజార్టీతో గెలిపించాలని కొస్గి ప్రజలను కోరారు. కొడంగల్ ప్రజలపై నమ్మకంతోనే తాను హైదరాబాద్ వెళ్తున్నానని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ఇదే తన చివరి ఉపన్యాసం కావొచ్చేమోనన్న సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను గద్దెదించటమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. మోదీ, కేసీఆర్‌ కలిసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే తన నివాసంలో సోదాలు చేపట్టారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తన విజయాన్ని అడ్డుకోలేరని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

ఓవైపు ఐటి దాడులు జరుగుతుంటే డోలు వాయిస్తూ రేవంత్ జోష్ (వీడియో)

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

ఒకవైపు ఐటీ దాడులు.. మరోవైపు రేవంత్ ఏం చేస్తున్నాడంటే

రేవంత్‌పై ఐటీ దాడులు...ఆరు నెలల నుంచి అకౌంట్‌లోకి కోట్ల రూపాయలు..?

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడుల వెనుక ఆయనే...

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

click me!