Omicron : ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి.. నెగిటివ్ వస్తేనే ఇంటికి, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు

By Siva KodatiFirst Published Nov 28, 2021, 7:04 PM IST
Highlights

దక్షిణాఫ్రికాలో (south africa) వెలుగుచూసిన ప్రమాదకర కరోనా వేరియంట్ (new corona variant)  ‘ఒమిక్రాన్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది (omicron). ఈ నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ (shamshabad international airport) విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించారు అధికారులు.

దక్షిణాఫ్రికాలో (south africa) వెలుగుచూసిన ప్రమాదకర కరోనా వేరియంట్ (new corona variant)  ‘ఒమిక్రాన్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది (omicron). దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి ప్రయాణీకుల రాకపై నిషేధం విధించాయి. తాజాగా భారత్ కూడా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ (shamshabad international airport) విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించారు అధికారులు. ప్రయాణికుల వద్ద 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు (rtpcr)  నెగటివ్ రిపోర్టు ఉండాల్సిందేనని ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. అలాగే, విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక మరోమారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాజిటివ్‌గా తేలిన వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని కానీ, ఆసుపత్రిలో చేరాలని ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారు.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్సువానా, ఇజ్రాయెల్, హాంకాంగ్, బెల్జియం తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో నెగటివ్ అని తేలితేనే విమానాశ్రయం నుంచి వెలుపలికి అనుమతిస్తారు. లేదంటే క్వారంటైన్‌కు తరలిస్తారు. ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు మరో రెండు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు అధికారులు. 

ALso Read:Omicron Variant : కేంద్రం అప్రమత్తం.. రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక మార్గదర్శకాలు

మరోవైపు కరోనా వైరస్ (coronavirus) కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకే మార్గదర్శకాలను (guide lines) విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్లపై (containment zones) ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. కరోనా పరీక్షలు పెంచాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలు ,  కేంద్ర పాలిత ప్రాంతాలకు గైడ్‌లైన్స్ విడుదల చేసింది కేంద్రం. హాట్‌స్పాట్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. 

కేంద్రం గైడ్‌లైన్స్: 

  • ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్.
  • ఇంటెన్సివ్ కంటైన్మెంట్, పటిష్ట నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలని రాష్ట్రాలకు సూచన.
  • కోవిడ్-19 పరీక్షలను పెంచాలని ఆదేశం.
  • కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్టు గుర్తింపు.
  • హాట్‌ స్పాట్లను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచన.
  • పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలి.
  • తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచన.
  • కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలి.
  • కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచన.
  • ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలని సూచన.
  • తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలని సూచన
click me!