ప్రధాని అపాయింట్‌మెంట్ అడగలేదు, విందులకే కేసీఆర్ ఢిల్లీ టూర్:దీక్ష విరమించిన రేవంత్, కోమటిరెడ్డి

By narsimha lodeFirst Published Nov 28, 2021, 4:43 PM IST
Highlights


రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరి దీక్ష చేపట్టింది.  ఈ దీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు  దీక్షను విరమించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల మరణానికి కేసీఆరే కారణమని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddyలు దీక్ష చేశారు. మాజీ మంత్రి జానారెడ్డి ఈ ఇద్దరు నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.  ఈ సందర్భంగా  టీపీసీసీ చీఫ్ Revanth Reddy ప్రసంగించారు.

 Farmers సమస్యలపై Kcr కి సోయి ఉందా అని ఆయన ప్రశ్నించారు.  Paddy ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వల్లే 45 రోజుల పాటు ధాన్యం కొనుగోలు ఆలస్యమైందని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించిన అంశాన్ని పక్కదారి పట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నెలల తరబడి ఉంటున్నారన్నారు.  ధాన్యం కొనుగోలుపై బెంగతో రైతులు మృతి చెందిన ఘటనలను ఆయన ప్రస్తావించారు.

also read:యాసంగిలో వరి సాగు వేయొద్దు.. తెలంగాణ రైతులకు తేల్చిచెప్పిన సీఎస్ సోమేశ్ కుమార్

రైతుల మృతికి కేసీఆర్ సర్కారే కారణమని ఆయన విమర్శించారు. వర్షాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకొందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. Kcr ద్రోహం చేయడం వల్లే  రైతులు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారని ఆయన చెప్పారు.  ప్రధాని మోడీని  కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగినట్టుగా రుజువు చేయాలన్నారు. విందుల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాడని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరి ధాన్యం సమస్యను సృష్టించిందే కేసీఆర్ అని ఆయన విమర్శించారు. 

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు,. వరి ధాన్యం కొనుగోలు విషయమై రైతులతో చర్చించేందుకు ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ తీసుకొంటామని ఆయన చెప్పారు. జంతర్ మంతర్ వద్ద దీక్షకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు  కాంగ్రెస్ పార్టీ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది.  ఈ విషయమై బీజేపీ, టీఆర్ఎస్ లు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది.  ఈ రెండు పార్టీలు సమస్యను పరిష్కరించకుండా రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే  రైతులు మృతి చెందుతున్నారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆందోళనతో రైతులు మృతి చెందుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు అంశం  చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ లు  ఈ విషయమై  పై చేయి సాధించేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. 


 

click me!