ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై లేవనెత్తండి: ఎంపీలకు కేసీఆర్ ఆదేశం

Siva Kodati |  
Published : Nov 28, 2021, 05:24 PM IST
ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై లేవనెత్తండి: ఎంపీలకు కేసీఆర్ ఆదేశం

సారాంశం

టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం (trs parliamentary party meeting) ముగిసింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు కేసీఆర్. పార్లమెంట్‌లో సమస్యలపై ప్రస్తావించాలని ఆయన సూచించారు

టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం (trs parliamentary party meeting) ముగిసింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు కేసీఆర్. పార్లమెంట్‌లో సమస్యలపై ప్రస్తావించాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలని ఇప్పటికే చాలా ఓపిక పట్టామన్నారు సీఎం కేసీఆర్. 

మరోవైపు తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 24 మధ్యాహ్నం రెండు గంటలకు  నిర్వహించనున్నారు.  పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు.  వరి ధాన్యం కొనుగోలుతో పాటు కరోనా నియంత్రణపై  ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.యాసంగి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి  స్పష్టత రాని నేపథ్యంలో  యాసంగిలో Paddy పండించవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Somesh Kumar నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న సీఎస్‌.. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

Also Read:యాసంగిలో వరి సాగు వేయొద్దు.. తెలంగాణ రైతులకు తేల్చిచెప్పిన సీఎస్ సోమేశ్ కుమార్

కలెక్టర్లు, సీనియర్‌ అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తున్నట్టు కొన్ని ఘటనలు వెలుగు చూశాయని సోమేశ్‌ కుమార్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కలెక్టర్లు, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో Bjp, Trs మధ్య మాటల యుద్ధం సాగుతుంది. వర్షాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు విమర్శలుచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ తీరును బీజేపీ నేతలు ఎండగడుతన్నారు. మరో వైపు బీజేపీ నేతల తీరుపై టీఆర్ఎస్ ఎదురు దాడికి దిగుతుంది. 

ఇటీవలనే ఢిల్లీకి వెళ్లి వచ్చిన  తెలంగాణ సీఎం Kcr ఢిల్లీలోని పరిణామాలను కూడా వివరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. ఈ విషయాలపై  Telangana Cabinet  లో చర్చించనున్నారు. వరి ధాన్యం కొనుగోలను వేగవంతం చేసే విషయమై కూడా చర్చించే అవకాశం ఉంది. మరో వైపు కరోనా కొత్త వేరియంట్ పై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు ఈ విషయమై జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిపై ఏ రకమైన ఆంక్షలు విధించాలనే దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో  ఆంక్షలను విధించిన పరిస్థితి నెలకొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?