కాంగ్రెస్ కి షాక్, కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి సీనియర్ నేతలు

By ramya neerukondaFirst Published Nov 16, 2018, 1:57 PM IST
Highlights

ఇద్దరు సీనియర్ నేతలు కాంగ్రెస్ ని వీడి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ కి ఊహించిన షాక్ తగిలింది.  ఇద్దరు సీనియర్ నేతలు కాంగ్రెస్ ని వీడి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ మైనారిటీ నేతలు అబిద్ రసూల్ ఖాన్ ,ఖలీల్ ఉర్ రెహమాన్ ,వారి అనుచరులు ఈ రోజు టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా అబిద్ రసూల్ ఖాన్ మాట్లాడుతూ.. 32ఏళ్లు కాంగ్రెస్ లో పనిచేశానన్నారు. తన తండ్రి కూడా కాంగ్రెస్ లోనే పనిచేశారని.. ప్రస్తుతం కాంగ్రెస్.. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తోందన్నారు. ముస్లిం లు ఎన్నికల్లో గెలవరని కాంగ్రెస్ వారికి టిక్కెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాహా చేసిన షబ్బీర్ అలీ కి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు.3 సార్లు ఓడి పోయిన షబ్బీర్ కు కాంగ్రెస్ టిక్కెట్ ఎలా ఇస్తారు ?
 అని ప్రశ్నించారు. క్రిమినల్ కేసులు ఉన్న వారికే కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.


త్వరలో షబ్బీర్ బండారం బయట పెడతానని శపథం చేశారు. ముస్లింలకు రాజకీయంగా పెద్ద పీట వేస్తున్న పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే 
అన్నారు. ముస్లిం లకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించింది టీఆర్ఎస్ పార్టీనేన్నారు. అందుకే టీఆర్ఎస్ లో చేరానన్నారు .
కాంగ్రెస్ ను టీడీపీ కంట్రోల్ చేస్తోందని..మొన్నటి దాకా బీజేపీ తో ఉన్న చంద్రబాబు ను ముస్లిం లు ఎలా నమ్ముతారు ? అని ప్రశ్నించారు.


ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్  మాట్లాడుతూ... ‘‘నేను మూడేండ్ల కిందట కండ్లు తెరచి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చా, ఇపుడు అబిద్ లాంటి నేతలు కళ్ళు తెరచి టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ ను ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. 2019 లోనే కాదు ..మరో 20 యేండ్లు టీఆర్ఎస్ యే గెలుస్తుంది .కెసిఆర్ యే సీఎం గా ఉంటారు. కెసిఆర్ కు హిందువులు ,ముస్లిం లు రెండు కళ్లు.’’ అని అన్నారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... ‘‘మంచి సమయం లో మంచి నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్ లో చేరుతున్న వారికి అభినందనలు. టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య స్నేహం ఉందని ఆరోపిస్తున్న చంద్రబాబు ,కాంగ్రెస్ నేతలకు తాజా చేరికలు చెంప చెళ్లుమనిపించాయి. మైనారిటీలకు 200 కు పైగా రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్ దే.షాదీ ముబారక్ పథకం తో పేద ముస్లిం లకు అండగా నిలిచారు కెసిఆర్. ఎక్కడా లేని విధంగా సిద్ధిపేట లో ఇక్బల్ మీనార్ మొట్ట మొదటి గా కట్టించింది కెసిఆర్ యే. వంద సీట్లు గెలిచి కెసిఆర్ మరో సారి సీఎం కాబోతున్నారు.బీజేపీకి, టీఆర్ఎస్ కి సిద్ధాంత పరమైన విరోధం ఉంది. మోడీ తో కలిసే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్ల ను గెలిచి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించ బోతోంది. మరోసారి అధికారం లోకి వచ్చాక మైనారిటీ లకు మరిన్ని అభివృద్ధి పథకాలు తీసుకొస్తాం’’ అన్నారు. 

click me!