మీ pet dog ను రిజిస్ట్రర్ చేసుకున్నారా? లేకపోతే రూ. 50 వేల ఫైన్..

Published : Dec 21, 2021, 09:43 AM IST
మీ pet dog ను రిజిస్ట్రర్ చేసుకున్నారా? లేకపోతే రూ. 50 వేల ఫైన్..

సారాంశం

రిజిస్టర్ కాని పెంపుడు జంతువులను పార్కులు, వీధులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు  తీసుకువెళితే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పౌర అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా జంతువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఉల్లంఘన స్థాయిని బట్టి రూ.1,000 నుండి రూ.50,000 వరకు భారీ జరిమానాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 

హైదరాబాద్ : పెంపుడు జంతువులను పెంచుకోవడం ఇక మీదట అంత ఈజీ కాదు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండేవారికి. పెంపుడు జంతువులను Registration చేసుకోని శునక ప్రేమికులందరిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కొరడా ఝలిపించనుంది. GHMC పెట్టిన నిబంధనలు అతిక్రమిస్తే రూ.50,000 వరకు జరిమానా విధించనుంది.

మొదటి దశలో, mandatory registration పెంపుడు కుక్కలకు మాత్రమే వర్తిస్తుంది. వీటిల్లో పిల్లుల లాంటి ఇతర పెంపుడు జంతువులకు మినహాయింపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ కాని పెంపుడు జంతువులను బహిరంగ ప్రదేశాలకు తీసుకువెళితే ఆయా పెంపుడు జంతువుల యజమానులు త్వరలో జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు తెలియజేసారు. 

అంతేకానీ, రిజిస్టర్ కాని పెంపుడు జంతువులను పార్కులు, వీధులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు  తీసుకువెళితే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పౌర అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా జంతువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఉల్లంఘన స్థాయిని బట్టి రూ.1,000 నుండి రూ.50,000 వరకు భారీ జరిమానాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 

సదరు పెనాల్టీ చెల్లించిన తర్వాత మాత్రమే యజమానులు తమ పెంపుడు జంతువులను తిరిగి పొందవచ్చు. ఈ చర్య డాగ్ ఓనర్స్ ను మరింత జవాబుదారీగా, బాధ్యతగా మారుస్తుందని అధికారులు చెబుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం, నగరంలో ప్రస్తుతం  50,000 పెంపుడు కుక్కలు ఉన్నాయి, అయితే వీటిలో కేవలం 465 పెట్ డాగ్స్ కు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంది. 

ఈ చర్యవల్ల పెంపుడు జంతువుల నమోదు భద్రతను మాత్రమే కాకుండా ఎన్ని ఉన్నాయి. ఎవరిదగ్గరున్నాయి. ఎలాంటి డాగ్స్ ఉన్నాయి.. వాటిని సోసైటికి ఎలా ఇంటరాక్ట్ అవుతారో.. దాన్ని ఎలా చూసుకుంటున్నారు అనేది కూడా అది నిర్ధారిస్తుంది.

ఈ నిబంధనల ప్రకారం, కుక్కల యజమానులు లైసెన్స్ పొందడం తప్పనిసరి. అంతేకాదు పెట్ డాగ్స్ కు యాంటీ-రాబిస్ టీకా ఇచ్చారని నిర్థారించడం, యేటా యాంటీ-రాబిస్ టీకా వేశారా లేదా అనేది రికార్డ్ అవుతుంది. 

పెంపుడు జంతువులకు వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు యజమానులు తమ పెంపుడు జంతువులను రోడ్డు పక్కన వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయని అధికారులు తెలిపారు. పెంపుడు జంతువులకు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించి శుభ్రం చేయాలని, లైసెన్సు పొందే ముందు మైక్రోచిప్‌లు అమర్చాలన్నారు. మైక్రోచిప్‌తో, GHMC నగరంలో పెంపుడు జంతువుల సంఖ్యను తనిఖీ చేస్తుంది. దీంతో ఒకవేళ వాటిని వదిలేస్తే .. ఆయా యజమానులను ట్రాక్ చేస్తుంది.

శంషాబాద్‌లో దారుణం: దొంగతనం చేశారని స్థంబానికి కట్టేసి గుండు కొట్టించారు

“పెంపుడు జంతువుల పట్ల యజమానులు బాధ్యత వహించాలి. మా పశువైద్య విభాగం
ఆకస్మిక తనిఖీలు చేస్తారు. ఈ తనిఖీల్లో ఏ యజమాని అయినా దోషిగా తేలితే, పెంపుడు జంతువులు సీజ్ చేయబడి, జరిమానా మొత్తం చెల్లించిన తర్వాత అవి విడుదల చేయబడతాయి”అన్నారాయన.

ఒకసారి లైసెన్స్ తీసుకుంటే ఏ అపార్ట్‌మెంట్ లేదా అసోసియేషన్ పెంపుడు జంతువులను కలిగి ఉండటంపై అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని అధికారి తెలిపారు indie dogs కు లైసెన్స్ ఫీజు మినహాయింపు ఉంటుందని.. దీనిద్వారా కుక్కలను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించినట్టుగా ఉంటుందని అన్నారు.  

ఈ రిజిస్ట్రేషన్ కు కూడా మాన్యువల్ రిజిస్ట్రేషన్ కాకుండా, పెంపుడు జంతువుల యజమానులు www.ghmc.gov.inకి లాగిన్ అయి రిజిస్ట్రర్ చేయించుకోవచ్చు. లాగిన్ అయ్యాక 'Our services' విభాగంపై క్లిక్ చేసి, లైసెన్స్ కోసం దరఖాస్తును పూరించడానికి ఎంపికను ఎంచుకోవాలి. అందులో వివరాలను నమోదు చేయాలి. తదనంతరం, లైసెన్స్ పొందడానికి రూ. 50 చెల్లించాలి.

రిజిస్ట్రేషన్ తర్వాత కుక్కకు ప్రత్యేక గుర్తింపు అందించబడుతుంది. పెంపుడు జంతువుల యజమానులు వారి శునకానికి వేయించిన ఇటీవలి టీకా సర్టిఫికేట్, నివాసానికి సంబంధించిన ఏదైనా రుజువు, ఇరుగుపొరుగు వారి నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాలి.

ఆ తరువాత అప్లికేషన్ స్వయంచాలకంగా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్‌కు ఫార్వార్డ్ చేయబడుతుంది. కార్యాలయం ద్వారా ధృవీకరించబడిన తర్వాత, లైసెన్స్ జారీ చేయబడుతుంది.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu