శంషాబాద్‌లో దారుణం: దొంగతనం చేశారని స్తంభానికి కట్టేసి గుండు కొట్టించారు

Published : Dec 21, 2021, 09:34 AM ISTUpdated : Dec 21, 2021, 09:45 AM IST
శంషాబాద్‌లో దారుణం: దొంగతనం చేశారని స్తంభానికి కట్టేసి గుండు కొట్టించారు

సారాంశం

శంషాబాద్ లో దారుణం చోటు చేసకొంది. వాహనలా బ్యాటరీలను దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరిని స్థానికులు స్థంబానికి కట్టేసి కొట్టారు. అంతేకాదు వారికి గుండు కొట్టించారు.  ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: వాహనాల బ్యాటరీలు దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరు యువకులను స్థంబానికి కట్టేసి గుండు కొట్టించారు స్థానికులు,  ఈ ఘటనపై బాధితులు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. .Shamshabad లోని అహ్మద్ నగర్ లో నివాసం ఉండే ఖుద్దూస్, ఖాజాలు old scrap వ్యాపారం చేస్తుంటారు. అయితే వాహనాల battery లను దొంగతనం చేస్తారని వీరిపై ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని వాహనాల బ్యాటరీలు చోరీకి గురౌతున్నాయి.

దీంతో స్థానికులు ఈ బ్యాటరీల కోసం Khaja  ఇంట్లో వెతికితే కొన్ని బ్యాటరీలు లభ్యమయ్యాయి.  ఖాజా, khuddus లు బ్యాటరీలను చోరీ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని విద్యుత్ స్థంబానికి కట్టేసి చితకబాదారు. అంతేకాదు  మళ్లీ  ఈ తరహాలో చోరీలకు పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇద్దరికి Head shave చేశారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు.  ఈ అవమానంపై బాధితులు శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను  అవమానపర్చిన ఘటనలో ఐదుగురిని శంషాబాద్ పోలీసులు Arrest చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ