ఉత్తమ్‌పై ఆత్రం, రేగా ఫైర్: అందుకే టీఆర్ఎస్‌లోకి

By narsimha lodeFirst Published Mar 4, 2019, 1:18 PM IST
Highlights

టీఆర్ఎస్ విధానాలు నచ్చే టీఆర్ఎస్‌లో చేరాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రేగా కాంతారావు  చెప్పారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ విధానాలు నచ్చే టీఆర్ఎస్‌లో చేరాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రేగా కాంతారావు  చెప్పారు.

సోమవారం నాడు ఆయన తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను,ఎంపీలను చేర్చుకోలేదా అని వారు ప్రశ్నించారు.

ఆదీవాసీల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని సక్కు చెప్పారు. ఆదీవాసీల సమస్యలపై కేసీఆర్ స్పందన చూసీ టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు.

సమస్యలపై సీఎంను కలిసేందుకు తమకుపార్టీ నాయకత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి ఓటు వేసేందుకు  రూ. 50 లక్షలు చెల్లిస్తామని కూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు చెప్పారన్నారు.

డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లమే అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవాళ్లమని ఆయన గుర్తు చేశారు. తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా ధర్నాలు చేస్తారో చూస్తామన్నారు. టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత  ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేస్తామన్నారు.
 

సంబంధిత వార్తలు

చంద్రబాబు పార్టీ మారలేదా, రేవంత్‌ను ఎంతకు కొన్నారు: కేటీఆర్

ఆపరేషన్ ఆకర్ష్: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

ముగిసిన సీఎల్పీ భేటీ: గాంధీ విగ్రహాం ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్నా

సీఎల్పీ భేటీ నుండి అర్ధాంతరంగా వెళ్లిన కోమటిరెడ్డి: నాయకత్వంపై విసుర్లు

click me!