దారుణం.. కొడుకిని ఇటుకతో కొట్టిచంపిన తల్లి

Published : Mar 04, 2019, 12:55 PM IST
దారుణం.. కొడుకిని ఇటుకతో కొట్టిచంపిన తల్లి

సారాంశం

భర్త మీద కోపంతో.. ఓ వివాహిత.. కన్న బిడ్డలను చంపి.. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. 


భర్త మీద కోపంతో.. ఓ వివాహిత.. కన్న బిడ్డలను చంపి.. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఒక కొడుకు ప్రాణాలు కోల్పోగా.. మరో కొడుకు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాదకర సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న రమాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు అజయ్‌, ఆర్యన్‌. భర్త ఎన్టీపీసీలో పని చేస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రమాదేవి భర్త విధులకు వెళ్లాడు. భర్త మీద కోపంతో రమాదేవి.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

దాంతో ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్‌(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత గ్యాస్‌ లీక్‌ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది రమాదేవి. ఈ లోపే స్థానికులు అక్కడికి చేరుకుని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

SIR గడువు మరోసారి పొడిగింపు.. ఓటర్లకు ఈసీ కీలక అవకాశం, చివ‌రి తేదీ ఎప్పుడంటే
ఆప్త మిత్రుడిని కోల్పోయా పెద్ది మరణంపై కేసీఆర్ ఎమోషనల్ | BRS Leader Peddi Sudarshan Reddy