Delhi Liquor Scam: ఈడీ విచారణకు కవిత గైర్హాజర్ వెనుక వ్యూహమిదీ

By narsimha lode  |  First Published Mar 16, 2023, 1:48 PM IST


ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ విచారణకు  కవిత గైర్హాజర్  వెనుక కవిత వ్యూహత్మకంగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 
 


న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఇవాళ  విచారణకు  హాజరు కాలేనని  చివరి నిమిషంలో  ఈడీకి  కవిత  సమాచారం పంపడంలో  వ్యూహత్మకంగా  వ్యవహరించిందనే  అభిప్రాయాలు  వ్యక్తమౌతున్నాయి. 
మహిళలను  విచారించే  సమయంలో  తన హక్కులను చూపి  కవిత  విచారణకు గైర్హాజరయ్యారు.  అయితే  ఈ విషయమై ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో  చూడాలి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్ర పిళ్లై,  గోరంట్ల బుచ్చిబాబులను   ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్రపిళ్లైను  ఈ నెల  6వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు.  ఈ స్కాంలో  తాను కవిత ప్రతినిధిగా వ్యవహరించినట్టుగా  అరుణ్ రామచంద్ర పిళ్లై  ఈడీ అధికారులకు  స్టేట్ మెంట్  ఇచ్చారు.ఈ స్టేట్ మెంట్ ను  ఈడీ అధికారులు  కోర్టుకు  సమర్పించారు. అయితే  ఆ తర్వాత  ఈ  స్టేట్ మెంట్ ను రామచంద్రపిళ్లై  వెనక్కి తీసుకున్నారు.  

Latest Videos

అయితే అరుణ్ రామచంద్రపిళ్లై,  గోరంట్ల బుచ్చిబాబులతో  కలిపి  కవితను  విచారించాలని  ఈడీ  ఉద్దేశ్యంగా  కన్పిస్తుందనే  అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  అయితే  అరుణ్ రామచంద్రపిళ్లై, బుచ్చిబాబులతో  కవిత  ముఖాముఖి  విచారణకు హాజరుకాకుండా తప్పించుకొనే వ్యూహంలో  భాగంగా  ఈడీ విచారణకు  హాజరు కాలేదనే అభిప్రాయాలు  కూడా వ్యక్తమౌతున్నాయి.  ముఖాముఖి విచారణను తప్పించుకొనేందుకు వీలుగా  న్యాయ పరమైన అంశాలను తనకు  అనుకూలంగా  కవిత వినియోగించుకొన్నారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.  గతంలో  విచారణకు  హాజరైన సమయంలో  దర్యాప్తు సంస్థలు  నిబంధనలు ఉల్లంఘించిన అంశాలను  కూడా  కవిత  తరపు న్యాయవాదులు  గుర్తు  చేస్తున్నారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  దర్యాప్తు సంస్థలు  నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని  కవిత  వాదిస్తున్నారు. 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద  కవితకు  ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.  

also read:Dlehi Liquor Sam: విచారణకు హాజరు కాలేనని కవిత లేఖ , ఈడీ నిర్ణయంపై ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  దర్యాప్తు సంస్థలు దాఖలు  చేసిన చార్జీషీట్ లో  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసిడియా,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పేర్లున్నాయి.  ఈ చార్జీషీట్ తర్వాతే మనీష్ సిసోడియాను  సీబీఐ అధికారులు  విచారించారు.. ఆయనను అరెస్ట్  చేశారు. ఈ నెలలో  ఈడీ అధికారులు కవితను  విచారణకు  రావాలని నోటీసులు జారీ చేశారు.  
 

click me!