Delhi Liquor Scamలో కవిత పిటిషన్ పై సుప్రీం నిర్ణయం ప్రకారం నడుస్తాం: సోమా భరత్

By narsimha lode  |  First Published Mar 16, 2023, 12:57 PM IST

కవిత  తరపున   డాక్యుమెంట్లను  ఈడీకి సమర్పించినట్టుగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి  సోమా భరత్  చెప్పారు.
 


న్యూఢిల్లీ: కవిత దాఖలు  చేసిన పిటిషన్ పై  ఈ నెల  24న  సుప్రీంకోర్టు  ఇచ్చే ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని  బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్  చెప్పారు. గురువారంనాడు  ఈడీ కార్యాలయం వద్ద  సోమా భరత్  మీడిాయాతో మాట్లాడారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కివిత తరపున  ఈడీకి  డాక్యుమెంట్లు ఇచ్చినట్టుగా  భరత్  చెప్పారు.  మహిళలను  ఇంటి వద్దే విచారణ చేయాలనే  నిబంధనలను  ఈడీ  అధికారులు  తుంగలో తొక్కారని  ఆయన  ఆరోపించారు.  కవితపై కేంద్రం  కక్షగట్టిందని  ఆయన ఆరోపించారు.  

Latest Videos

ఈ నెల 11వ తేదీన  కవితను విచారించిన సమయంలో  ఈడీ అధికారులు  నిబంధనలను  తుంగలో తొక్కారన్నారు. సాయంత్రం ఆరు గంటల లోపుగానే విచారణ పూర్తి చేయాలని  నిబంధనలను ఈడీ  అధికారులు పాటించలేదన్నారు.  మహిళలను ఇంటివద్దే విచారించాల్సి  ఉన్నా కూడా  ఈడీ కార్యాలయానికి  పిలిపించారని  భరత్  చెప్పారు. చట్ట ప్రకారంగా  ఇంటి వద్దే విచారించాలని  కవిత  కోరినట్టుగా  ఆయన  గుర్తు  చేశారు.   కానీ ఆనాడు  ఈడీ అధికారులు  ఇంటి వద్ద  విచారణ  చేసేందుకు అంగీకరించలేదన్నారు.  చట్టాన్ని గౌరవించే  వ్యక్తిగా  ఈ నెల  11న కవిత ఈడీ  విచారణకు హాజరైనట్టుగా  భరత్  వివరించారు.  

also read:Dlehi Liquor Sam: విచారణకు హాజరు కాలేనని కవిత లేఖ , ఈడీ నిర్ణయంపై ఉత్కంఠ

 తప్పుడు  కేసులతో కవితను ఇబ్బంది పెట్టాలని  చూస్తున్నారన్నారు.  కవిత తరపున తాను  ఇచ్చిన  డాక్యుమెంట్లను ఈడీ తీసుకుందిన  సోమా భరత్  చెప్పారు.  ఇవాళ  కవిత   పంపిన  లేఖపై  ఈడీ నుండి  ఎలాంటి సమాచారం రాలేదని  సోమా భరత్  చెప్పారుు. . అంతేకాదు  విచారణకు  మరో తేదీని  కూడా ఇవ్వలేదన్నారు.  

 

 

click me!