ఇక ‘డబుల్’ వేగంతో..

First Published Mar 1, 2017, 11:37 AM IST
Highlights

నగర శివారు ప్రాంతాల్లో మరో 600 ఎకరాలను డబుల్ బెడ్ రూంల నిర్మాణానికి గుర్తించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లాగ్ షిప్ పథకంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

 

వచ్చే ఎన్నికల లోపే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు లబ్దిదారులనే గుర్తించలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో డబుల్ బెడ్  రూం ఇళ్ల నిర్మాణంపై స్వయంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. మున్సిపల్ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూం కార్యక్రమ అమలు తీరుపైన ఈ రోజు కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన  డబుల్ బెడ్ రూం కార్యక్రమం దేశానికే అదర్శంగా ఉండేలా చూస్తామని తెలిపారు. పక్కా గృహాల నిర్మాణ రంగంలో రాష్ట్రం ఒక మోడల్ గా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి నేరుగా ఈ కార్యక్రమం పైన ప్రత్యేకంగా దృష్టి సారించారని, నగరంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా లక్ష ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.

 

నగర శివారు ప్రాంతాల్లో మరో 600 వందల ఎకరాలను ఈ డబుల్ బెడ్ రూంల నిర్మాణానికి గుర్తించామని తెలిపారు.

 

నగరంలో అనేక రకాలైన మౌళిక వసతుల ప్రాజెక్టులను చేపట్టేలా ప్రణాళికలు వేసామని, వచ్చే రెండేళ్లలోనే స్కైవేలు పూర్తి అయ్యేలా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ విధానాల ఫలితంగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కోలుకుని దేశంలోని అత్యధికంగా అఫీస్ స్పెస్ వినియోగం పెరుగుదలలో రాష్ర్టం నంబర్ వన్ గా ఉందన్నారు.

click me!