వనపర్తి జిల్లాలో కోడలికి మామ లైంగిక వేధింపులు: కర్రతో కొట్టిన కోడలు, తీవ్ర గాయాలతో మృతి

Published : May 17, 2022, 02:49 PM ISTUpdated : May 17, 2022, 02:57 PM IST
 వనపర్తి జిల్లాలో కోడలికి మామ లైంగిక వేధింపులు: కర్రతో కొట్టిన కోడలు, తీవ్ర గాయాలతో మృతి

సారాంశం

లైంగికంగా వేధించినందుకు మామను కర్రతో కొట్టింది కోడలు. ఈ దెబ్బలకు తాళలేక మామ రాములు మరణించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూరులో చోటు చేసుకొంది.


గోపాల్‌పేట: Wanaparthy జిల్లా  Gopalpet మండలం Chennuruలో దారుణం చోటు చేసుకొంది. కోడల్ని వేధించిన మామపై కోడలు కర్రతో దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఇదిలా ఉంటే ఆస్తి కోసమే మామను కోడలు కొట్టి చంపిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

చెన్నూరులో రాములు అనే వ్యక్తి తన కోడల్ని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. తనను Sexual harassment వేధింపులకు గురి చేస్తున్న  సమయంలో Mobile లో రికార్డు చేసినట్టుగా కోడలు చెబుతుంది.  ఇవాళ కూడా లేధింపులకు గురి చేయడంతో రాములును కోడలు తీవ్రంగా కర్రలతో కొట్టింది. గాయపడిన రాములును ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరణించాడు.

also read:మహిళా న్యాయవాదికి లైంగిక వేధింపులు.. వైరల్ గా మారిన లేఖ..

మెదక్ జిల్లాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగినిపై అదే శాఖలో పనిచేస్తున్న అధికారి ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  ఈఘటన ఈ నెల 14న వెలుగు చూసింది.కొన్ని వారాల కిందట జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  బాధిత మహిళ ఐసీడీఎస్‌లో కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నారు. ప్రతి ఏడాది మార్చి నెలతో కాంట్రాక్ట్ జాబ్ గడువు ముగుస్తుంది. అయితే  దానిని కొనసాగించేందుకు జిల్లా అధికారుల నుంచి సంబంధిత పేపర్ల మీద సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాధిత మహిళ జాబ్ ఎక్స్‌టెన్షన్ కోసం లెటర్‌పై సంతకం కావాలని బాధిత మహిళ జయరాం అనే అధికారిని కోరారు. 

అయితే జయరాం ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనతో రాత్రి గడిపితేనే సంతకం పెడతానని జయరాం నాయక్ చెప్పాడు. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపించారు. 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందపల్లికి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై  అదే గ్రామానికి చెందిన బాణాల సురేష్ ప్రేమ పేరుతో మోసం చేశాడు.  బాలిక గర్భం దాల్చింది. దీంతో తల్లిదండ్రులు నిలదీయడంతో బాలిక అసలు విసయం చెప్పింది. ఈ ఘటన ఈ నెల 9వ వెలుగు చూసింది. 

 సురేష్ తో ప్రేమాయణం గురించి బయటపెట్టింది. వారు తమ కూతురుని పెళ్లిచేసుకోవాలని సురేష్ ని కోరగా అందుకతడు నిరాకరించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు దమ్మన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన సురేష్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.అలాగే తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన బాలిక కుటుంబసభ్యులను కులం పేరుతో దూషించిన సురేష్ తల్లిదండ్రులు, నాన్నమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. గర్భవతిని చేసిన సురేష్ తోనే తమ కూతురి పెళ్ళిచేసి న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్