కాకినాడలో అదృశ్యమైన ప్రేమ జంట హైద్రాబాద్‌లో ఆత్మహత్యాయత్నం:చికిత్స పొందుతూ బాలిక మృతి

Published : May 17, 2022, 12:03 PM IST
 కాకినాడలో అదృశ్యమైన ప్రేమ జంట హైద్రాబాద్‌లో ఆత్మహత్యాయత్నం:చికిత్స పొందుతూ బాలిక మృతి

సారాంశం

కాకినాడలో అదృశ్యమైన బాలిక సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తమ కూతురిని తీసుకొచ్చిన అబ్బాయే తమ కూతురిని చంపాడని మృతురాలి పేరేంట్స్ ఆరోపిస్తున్నారు.

కాకినాడ: Kakinada లో అదృశ్యమైన బాలిక హైద్రాబాద్ Gandhi  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ప్రేమించిన యువకుడితో వచ్చిన బాలిక మారేడుపల్లిలో Suicide Attmept చేసుకొంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ఇదిలా ఉంటే తమ కూతురిని హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కాకినాడలోని ఎల్లగిరి ప్రాంతానికి చెందిన  Minor Girl తెనాలికి చెందిన Hari krishna తో Love వ్యవహరం ఉందని స్థానికులు చెబుతున్నారు. రెండు వారాల క్రితం వీరిద్దరూ కూడా ఇల్లు వదిలి సికింద్రాబాద్ కు చేరుకున్నారు.  మారేడ్ పల్లిలో వీరిద్దరూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. వీరిద్దరి వద్ద ఉన్న అడ్రస్ ల ఆధారంగా పోలీసులు ద్రాక్షారామం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 ద్రాక్షరామంలో అదృశ్యమైన బాలికగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ బాలిక కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రిలో తమ కూతురిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురిని ప్రేమ పేరుతో  Hyderabadకు తీసుకు వచ్చి అబ్బాయే హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు