జననాయకురాలిగా కల్వకుంట కవిత... రామోజీరావు ఆసక్తికర లేఖ

By Arun Kumar PFirst Published Nov 28, 2021, 1:26 PM IST
Highlights

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయిన కల్వకుంట కవితకు ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు అభినందనలు తెలిపారు. 

హైదరాబాద్: నిజామాబాద్ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానంనుండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు అభినందనలు తెలుపుతూ రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీ రావు లేఖ రాసారు.

''నిజామాబాద్ జిల్లాలో స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయిన మీకు హార్ధిక అభినందనలు తెలియజేస్తున్నాను.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి జననాయకురాలిగా ఇనుమడించిన కీర్తి గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నోవిజయాలు సాధించి అందరి మన్ననలందుకుంటారని భావిస్తున్నాను'' అని  kalvakunta kavitha కొనియాడుతూ ramoji raoలేఖ రాసారు.  

ఇదిలావుంటే తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వుండటంతో ఇతర పార్టీలేవీ పోటీచేయకపోవడంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అయితే స్థానికసంస్థల కోటా ఎన్నికలు మాత్రం రసవత్తంగా మారాయి. మొత్తం 12స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే ఆరు ఏకగ్రీవం కాగా మరో ఆరుచోట్ల ఎన్నిక తప్పడం లేదు. 

నిజామాబాద్ నుండి ఎమ్మెల్సి కవిత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి  సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, వరంగల్ నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

read more  కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పూజలు.. ‘అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి’

ఇక Karimnagar జిల్లాలో TRS Party కి షాకిస్తూ మాజీ ముయర్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసాడు. దీంతో ఈ జిల్లాలో ఎన్నిక తప్పడంలేదు. టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ తో పాటు హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో టిడిపిని వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎల్.రమణ పోటీ చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి దండే విఠల్,  ఖమ్మం నుండి తాతా మధు, మెదక్ నుండి యాదవరెడ్డి, నల్గొండ నుండి ఎంసీ కోటిరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 

నిజామాబాద్ లో ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ సమయంలో గందరగోళం నెలకొంది. ఈ స్థానానికి రెండే నామినేషన్లు దాఖలయితే ఒక నామినేషన్ కవితది కాగా రెండోది స్వతంత్ర అభ్యర్ధిగా శ్రీనివాస్ ది. అయితే  శ్రీనివాస్‌ను బలపరుస్తూ తాము సంతకాలు చేయలేదని... తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఎంపీటీసీ, కార్పొరేటర్‌ ఎదురుతిరిగారు. దీంతో అతడి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

read more  తిరిగి ఎమ్మెల్సీగా ఏకగ్రీవం... తల్లితో కలిసి అష్టలక్ష్మి అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు

ఇక తెలంగాణ రాష్ట్రంలోని 2 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంది. ఖమ్మం, మెదక్ జిల్లాలో  రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్దులకు కాంగ్రెస్  పార్టీ బీ ఫారాలు అందించింది. ఖమ్మం లో రాయల్ నాగేశ్వర్ రావు, మెదక్ లో జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్లను తమ అభ్యర్ధులకు పడేలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను బరిలోకి దింపింది. 

click me!