Rave Party in kukatpally: కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 44 మంది స్వలింగ సంపర్కులు

By team teluguFirst Published Nov 28, 2021, 12:31 PM IST
Highlights

కూకట్‌పల్లిలో నిర్వహించిన రేవ్ పార్టీని (Rave Party in kukatpally) పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు పదుల సంఖ్యలో స్వలింగ సంపర్కులతో పాటుగా, ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్‌ (Hyderabad) శివార్లలో రేవ్ పార్టీలు జరగడం వెలుగులోకి రావడం చూశాం.. అయితే తాజాగా నగరంలోనే రేవ్ పార్టీ జరగడం తీవ్ర కలకలం రేపింది. కూకట్‌పల్లిలో నిర్వహించిన రేవ్ పార్టీని (Rave Party in kukatpally) పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు పదుల సంఖ్యలో యువకులతో పాటుగా, ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కూకట్ పల్లి వివేక్‌ నగర్‌లోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున యువత మద్యం మత్తులో చిందేశారు. రచ్చరచ్చ చేశారు. హిజ్రాలతో కలిసి అసభ్యకరంగా డ్యాన్సులు వేశారు. ఇందుకు సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకని ఇంటిపై దాడులు నిర్వహించారు. అయితే అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. 

అక్కడ పెద్ద సంఖ్యలో స్వలింగ సంపర్కులు.. మద్యం, హుక్కా సేవించి నృత్యాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రతి వీకెండ్‌లో వారు ఇలాంటి పార్టీలు చేస్తున్నట్టుగా  తేల్చారు. ఈ పార్టీలు నిర్వహిస్తున్న  ఇమ్రాన్, దయాల్‌పై కేసు నమోదు చేశారు. ఈ పార్టీకి సందబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 44 మంది స్వలింగ సంపర్కులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పెద్ద మొత్తంలో మద్యం బాటిల్స్‌, కండోమ్స్ ప్యాకెట్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వలింగ సంపర్కులను కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ఇక, పెద్ద సంఖ్యలో స్వలింగ సంపర్కులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని.. రెండేళ్ల నుంచి ప్రతి శనివారం పార్టీలు చేసుకుంటున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి రూ. 300 తీసుకుంటున్నారు. పార్టీలు నిర్వహించేందుకు ఓ ఇంటిని రూ. 30 వేలకు అద్దెకు తీసుకున్నారు. 

click me!