రేపు తెలంగాణ కేబినెట్ భేటీ: వరి ధాన్యం కొనుగోలు సహా కీలకాంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Nov 28, 2021, 11:54 AM IST
Highlights

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 29న హైద్రాబాద్ లో జరగనుంది. వరి ధాన్యం కొనుగోలు సహా పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. కేసీఆర్ గత వారంలోనే ఢిల్లీకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. 
 

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 24 మధ్యాహ్నం రెండు గంటలకు  నిర్వహించనున్నారు.  పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు.  వరి ధాన్యం కొనుగోలుతో పాటు కరోనా నియంత్రణపై  ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.యాసంగి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి  స్పష్టత రాని నేపథ్యంలో  యాసంగిలో Paddy పండించవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Somesh Kumar నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న సీఎస్‌.. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

కలెక్టర్లు, సీనియర్‌ అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తున్నట్టు కొన్ని ఘటనలు వెలుగు చూశాయని సోమేశ్‌ కుమార్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కలెక్టర్లు, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో Bjp, Trs మధ్య మాటల యుద్ధం సాగుతుంది. వర్షాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు విమర్శలుచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ తీరును బీజేపీ నేతలు ఎండగడుతన్నారు. మరో వైపు బీజేపీ నేతల తీరుపై టీఆర్ఎస్ ఎదురు దాడికి దిగుతుంది. 

also read:యాసంగిలో వరి సాగు వేయొద్దు.. తెలంగాణ రైతులకు తేల్చిచెప్పిన సీఎస్ సోమేశ్ కుమార్

ఇటీవలనే ఢిల్లీకి వెళ్లి వచ్చిన  తెలంగాణ సీఎం Kcr ఢిల్లీలోని పరిణామాలను కూడా వివరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. ఈ విషయాలపై  Telangana Cabinet  లో చర్చించనున్నారు. వరి ధాన్యం కొనుగోలను వేగవంతం చేసే విషయమై కూడా చర్చించే అవకాశం ఉంది. మరో వైపు కరోనా కొత్త వేరియంట్ పై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు ఈ విషయమై జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిపై ఏ రకమైన ఆంక్షలు విధించాలనే దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో  ఆంక్షలను విధించిన పరిస్థితి నెలకొంది. 

మరో వైపు ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు.  వరి ధాన్యం కొనుగోలు విషయాన్ని బీజేపీ, టీఆర్ఎస్ లు రాజకీయంగా ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు పనిచేస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీల తీరుతో   రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.  ధాన్యం కొనుగోలులో ఆలస్యం కావడంతో రైతులు మరణిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకొన్నాయి.  కామారెడ్డి జిల్లాలోనే ఇద్దరు  రైతులు ఈ మాసంలోనే మరణించారు.  దీంతో విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ధాన్యం కొనుగోలుపై ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించనుంది తెలంగాణ కేబినెట్ 

click me!