హైదరాబాద్: ఆన్‌లైన్ loan యాప్ నిర్వాహకుల వేధింపులను భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొన్న ఘటన hyderabad ఉప్పల్ లో చోటు చేసుకొంది. అప్పు చెల్లించలేదని యువకుడి బంధువులు, స్నేహితులకు మేసేజ్ పెట్టి వేధింపులకు గురి చేయడంతో బాధితుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
Jayashankar Bhupalpally జిల్లా రేగొండకు చెందిన సింగటి రమేష్ హైద్రాబాద్ లోని Uppal లో ఎనిమిది నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. తనతో పాటు ఇతర మిత్రులు కూడా అదే రూమ్ లో ఉంటున్నారు. Ramesh ఆన్ లైన్ లో గణితం బోధిస్తున్నాడు. అయితే అవసరం కోసం రమేష్ online app ద్వారా రూ.5 వేలు అప్పుగా తీసుకొన్నాడు. అయితే సకాలంలో రమేష్ ఈ అప్పును చెల్లించలేదు. దీంతో రమేష్ బంధు మిత్రులకు యాప్ నిర్వాహకులు ఈ విషయమై మేసేజ్ పెట్టారు. ఈ అప్పును చెల్లించాలని రమేష్ ను పదే పదే వేధింపులకు గురి చేశారు. ఈ వేధింపులు భరించలేక రమేష్ శనివారం నాడు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన గదిలో మిత్రులు ఎవరూ లేని సమయంలో రమేష్ ఫ్యాన్ కు ఉరేసుకొన్నాడు.
రమేష్ మిత్రులు ఇంటికి వచ్చిన చూసే సరికి లోపలి నుండి గడియ వేసి ఉంది. మరో గది నుండి లోపలికి వెళ్లి చూడగా రమేష్ ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించాడు. వెంటనే అతడిని కిందకి దించారు. కానీ రమేష్ అప్పటికే మరణించాడు.ఈ విషయమై స్నేహితులు రమేష్ పేరేంట్స్ కు సమాచారం ఇచ్చారు. రమేష్ కుటుంబ సభ్యులు ఉప్పల్ Policeకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు case నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ యాప్ నిర్వాహణలో ప్రధాన సూత్రధారిగా ఉన్న జెన్నిఫర్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. జెన్నిఫర్ పరారీలో ఉన్నట్టుగా charge sheet లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగుళూరు, ముంబై, ఢిల్లీలో బాధితులు ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఏడుగురు ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు చార్జీషీట్ లో ప్రస్తావించారు.
2019 నవంబర్ లో డిల్లీలో 3 సంస్థలు జెన్నిఫర్, జియాంగ్ ప్రారంభించారని చార్జీషీట్ లో పోలీసులు తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైద్రాబాద్ లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని లోన్ తీసుకొన్న వారిని వేధింపులకు గురిచేశారని పోలీసులు చెప్పారు.
ఈ యాప్ ల ద్వారా 7 నెలల్లో సుమారు రూ. 30 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని పోలీసులు తెలిపారు. అంతేకాదు సుమారు రూ. 11 వేల కోట్ల లాభాలను ఆర్జించారని చెప్పారు.యాప్ నిర్వహణ ద్వారా వర్జిన్ ఐ ల్యాండ్ లో బినామీ ఖాతాలోకి నగదును బదిలీ చేశారని పోలీసులు వివరించారు. ఈ యాప్ ల ద్వారా వచ్చిన డబ్బును దశలవారీగా షాంఘైకి తరలించారని చెప్పారు. అరెస్టు చేసిన వారి నుండి ఇప్పటికే రూ. 315 కోట్లు సీజ్ చేసినట్టుగా పోలీసులు చార్జీషీటులో తెలిపారు.