తెలంగాణలో (corona cases in telangana) కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 95,355 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 3,590 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 7,58,566కి చేరుకుంది.
తెలంగాణలో (corona cases in telangana) కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 95,355 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 3,590 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 7,58,566కి చేరుకుంది. తాజాగా కోవిడ్ బారినపడి (corona deaths in telangana)ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 3,555 మంది కరోనా నుంచి కోలుకోగా.. వీటితో కలిపి ఇప్పటి వరకు 7,14,034 మంది మహమ్మారి నుంచి బయటపడినట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణలో 40,447 యాక్టీవ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.13 శాతంగా ఉంది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1160 మందికి పాజిటివ్‌గా తేలింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 47, భద్రాద్రి కొత్తగూడెం 105, జీహెచ్ఎంసీ 1160, జగిత్యాల 57, జనగామ 42, జయశంకర్ భూపాలపల్లి 31, గద్వాల 28, కామారెడ్డి 42, కరీంనగర్ 119, ఖమ్మం 121, మహబూబ్‌నగర్ 71, ఆసిఫాబాద్ 22, మహబూబాబాద్ 46, మంచిర్యాల 79, మెదక్ 47, మేడ్చల్ మల్కాజిగిరి 257, ములుగు 22, నాగర్ కర్నూల్ 45, నల్గగొండ 98, నారాయణపేట 26, నిర్మల్ 47, నిజామాబాద్ 67, పెద్దపల్లి 63, సిరిసిల్ల 41, రంగారెడ్డి 215, సిద్దిపేట 115, సంగారెడ్డి 118, సూర్యాపేట 98, వికారాబాద్ 53, వనపర్తి 53, వరంగల్ రూరల్ 45, హనుమకొండ 132 యాదాద్రి భువనగిరిలో 78 చొప్పున కేసులు నమోదయ్యాయి.
undefined
కాగా.. భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. అయితే గత రెండు మూడు రోజులుగా కొత్త కేసులు సంఖ్య స్వల్పంగా తగ్గుతుంది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,35,532 కోవిడ్ కేసులు (Covid cases) నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,08,58,241కి చేరింది. తాజాగా కరోనాతో 871 మంది మృతిచెందారు. అయితే తాజాగా మరణాల్లో గత 24 గంటల్లో 613 మంది మృతిచెందగా.. కేరళ ప్రభుత్వం 258 బ్యాక్ లాగ్ మరణాలు నమోదు చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,93,198కి పెరిగింది.
గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,35,939 కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,83,60,710కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,04,333గా ఉంది. ఇక, తాజా నమోదైన కొత్త కేసులలో.. కేరళలో అత్యధికంగా కేరళలో 54,537, కర్ణాటకలో 31,198, తమిళనాడులో 26,533, మహారాష్ట్రలో 24,948, ఆంధ్రప్రదేశ్‌లో 12,561 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులలో దాదాపు 63.59 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. కేవలం కేరళలోనే 23.15 శాతం కేసులు ఉన్నాయి.
మరోవైపు దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 13.39 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 16.89 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.89 శాతంగా, యాక్టివ్ కేసులు.. 4.91 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉంది. ఇక, దేశంలో శుక్రవారం (జనవరి 28) రోజున 17,59,434 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 72,57,74,705 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది.
Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.29.01.2022 at 5.30pm) pic.twitter.com/YJnn5x6dAr