హీరో రవితేజ తమ్ముడికి బ్లూఫిలింస్ సప్లై చేసేది రఘునందనరావే: రాధారమణి

Siva Kodati |  
Published : Feb 04, 2020, 04:40 PM IST
హీరో రవితేజ తమ్ముడికి బ్లూఫిలింస్ సప్లై చేసేది రఘునందనరావే: రాధారమణి

సారాంశం

కేసుల పరిష్కారం కోసం వచ్చే ఆడవారిని రఘునందన్ రావు భయపెట్టి లొంగదీసుకుంటాడని రాధారమణి ఆరోపించారు. అనంతరం వారితో బ్లూ ఫిలింగ్ తీసి రాజకీయ నాయకులకు పంపిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తాడని చెప్పారు. హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లై చేసేది రఘునందన్ రావేనన్నారు. 

కేసుల పరిష్కారం కోసం వచ్చే ఆడవారిని రఘునందన్ రావు భయపెట్టి లొంగదీసుకుంటాడని రాధారమణి ఆరోపించారు. అనంతరం వారితో బ్లూ ఫిలింగ్ తీసి రాజకీయ నాయకులకు పంపిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తాడని చెప్పారు.

హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లై చేసేది రఘునందన్ రావేనన్నారు. అతనే దగ్గరుండి పరిచయం చేయించి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావుకు సప్లై చేయించేవాడని రాధ తెలిపారు. బ్లూ ఫిలింస్‌లకు సంబంధించిన యూనిట్ ముంబైలో ఉందని... అక్కడి నుంచి ఇవి సప్లయి అవుతూ ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

Also Read:భర్తతో కలిసి నన్ను రఘునందన్ ‌రావు రేప్ చేశాడు: రాధారమణి

తాను ఈ బాగోతాన్ని ఆధారాలతో సహా పట్టిస్తే సీసీఎస్ పోలీసులు కేస్ క్లోజ్ చేశారని.. ఎందుకని అడిగితే రఘునందన్ రావు చెప్పారు అందుకే చేశామని చెప్పేవారని రాధారమణి వెల్లడించారు.

దీనిపై ఎక్కువ మాట్లాడితే తనను ఎన్‌కౌంటర్ చేస్తానని సీఐ రాజశేఖర్ రెడ్డి పబ్లిక్‌లో ఎన్నోసార్లు బెదిరించారని ఆమె ఆరోపించారు. తాను ఎక్కడ కేసు పెట్టినా సీఐ రాజశేఖర్ రెడ్డి, రఘునందన్ రావు ఫోన్ చేసి కేసును తీసుకోవద్దని ఫోన్‌ చేసి చెబుతారని రాధా ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:కాఫీలో మత్తు మందు కలిపి రేప్ చేశాడు, 12 ఏళ్లుగా...: రఘునందన్ రావుపై మహిళ ఆరోపణ

రఘునందన్ రావును అడ్డం పెట్టుకుని శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు పబ్బం గడుపుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేసి, వ్యాపారాలు చేస్తున్నారని రాధా మండిపడ్డారు. సంవత్సరం పాటు కేసు తీసుకోకుండా తనను ప్రతిరోజూ తిప్పేవారని.. రఘునందన్ రావు వచ్చి తనకు అడ్డుపడేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్తకు గతంలోనే పెళ్లయ్యిందని.. కానీ రఘునందన్ రావు చెప్పిన విధంగా పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి ట్రాప్ చేసి వివాహం చేసుకున్నాడని రాధా పేర్కొన్నారు. ఎస్ఆర్ నగర్ సీఐ, ఎస్ఐలు రఘునందన్ చెప్పినట్లు వినాలని ఒత్తిడి చేస్తున్నారని రాధారమణి కన్నీటిపర్యంతమయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu