నిజామాబాద్‌‌లో స్పైస్ ప్రాంతీయ బోర్డు: పార్లమెంట్‌లో ప్రకటించిన పీయూష్ గోయెల్

Siva Kodati |  
Published : Feb 04, 2020, 03:37 PM IST
నిజామాబాద్‌‌లో స్పైస్ ప్రాంతీయ బోర్డు: పార్లమెంట్‌లో ప్రకటించిన పీయూష్ గోయెల్

సారాంశం

నిజామాబాద్ జిల్లాలో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో ప్రకటించారు. ఈ బోర్డు పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని.. పసుపు సహా మిగిలిన మసాలా దినుసుల కోసం ఈ కార్యాలయం పనిచేస్తుందని పీయూష్ తెలిపారు

నిజామాబాద్ జిల్లాలో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో ప్రకటించారు. ఈ బోర్డు పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని.. పసుపు సహా మిగిలిన మసాలా దినుసుల కోసం ఈ కార్యాలయం పనిచేస్తుందని పీయూష్ తెలిపారు.

Also Read:నిజామాబాద్ జిల్లా రైతులకు ఝలక్: అంతకు మించి అంటున్న ఎంపీ అరవింద్

ఇందుకోసం ప్రస్తుతం అక్కడున్న డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి పెంచుతున్నట్లు గోయల్ వెల్లడించారు. ఐఏఎస్ ర్యాంక్ అధికారి డైరెక్టర్‌గా ఈ ప్రాంతీయ కార్యాలయంలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.

ఇది నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు రిపోర్టు చేస్తుందన్నారు. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయని.. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు అన్ని విధాలుగా సహకరిస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

Also Read:కవిత ఓటమి: బీజేపీ ఎంపీ అరవింద్ కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదే...

రైతులకు అంతర్జాతీయ బయ్యర్లతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందని.. నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలే కల్పించామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Padma Awards 2026 : తెలంగాణకు 7, ఏపీకి 4 పద్మ అవార్డులు.. ఆ 11 మంది ఎవరంటే?
Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu