Telangana: సంతోషి మాత టెంపుల్ చోరీ కేసు.. నిందితుల అరెస్టు

By Mahesh RajamoniFirst Published Jan 22, 2022, 10:35 PM IST
Highlights

Telangana: హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని సంతోషి మాత దేవాలయంలో జరిగిన అభరణాలు, హుండీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగ‌త‌నానికి సంబంధించిన కేసు వివ‌రాల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేష్ మ‌హేష్ భ‌గ‌వ‌త్ (rachakonda cp mahesh bhagwat) మీడియాకు వెల్ల‌డించారు. 
 

Telangana: హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని సంతోషి మాత దేవాలయం (santoshimatha temple) లో జరిగిన అభరణాలు, హుండీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి (arrested) తీసుకున్నారు. ఈ దొంగ‌త‌నానికి సంబంధించిన కేసు వివ‌రాల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ (rachakonda cp mahesh bhagwat) మీడియాకు వెల్ల‌డించారు. గతేడాది డిసెంబర్ 3న ఎల్బీన‌గ‌ర్ లోని సంతోషిమాత దేవాలయంలో చోరీ జరిగింది. హుండీలోని కానుకలతో పాటు అమ్మ వారి ఆభరణాలు, దేవాల‌యంలోని ప‌లు వ‌స్తువుల‌ను  దొంగ‌లు ఎత్తుకుపోయారు. సంతోషిమాత దేవాల‌యం (santoshimatha temple) లో అమ్మవారి నగలు చోరీకి గురి అయ్యాయని  పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. 

ఎల్బీన‌గ‌ర్ లోని సంతోషిమాత దేవాల‌యం (santoshimatha temple) లో అమ్మవారి నగలు చోరీకి గురి అయ్యాయని ఫిర్యాదు అందుకున్న పోలీసులు..  ద‌ర్యాప్తు ప్రారంభించారు.  అందింది. దేవాల‌యంలో అమ్మవారి న‌గ‌ల చోరీకి సంబంధించిన కేసు కావడంతో దీనిపై ప్ర‌త్యేక దృష్టి సారించిన ఉన్న‌తాధికారులు.. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా ఐదు దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. ఫిర్యాదు మేరకు  సీసీటీవీ కెమెరాల తో పాటు దర్యాప్తు చేపట్టారు. అంతరాష్ట్ర దొంగల పని అని గుర్తించిన పోలీసులు ఐటీ , సైబర్ క్రైమ్, స్పెషల్ టీమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును ఛేదించామ‌ని రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ (rachakonda cp mahesh bhagwat) శ‌నివారం నాడు మీడియాకు వెల్ల‌డించారు. అంతరాష్ట్ర దొంగల ముఠా గ్యాంగ్ ఐదుగురిని  సభ్యుల ను గుర్తించిన పోలీసులు  ఇందులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసామ‌ని తెలిపారు. 

పోలీసులు (rachakonda police) అదుపులోకి తీసుకున్న ఈ దొంగ‌ల‌ గ్యాంగ్ లో  గుంటూరు జిల్లా కు చెందిన పొన్నూరి చిన్న సత్యనంద్ అలియాస్ సతీష్., మాండ్ల నాగేందర్,  గంధం సమ్మయ్య, జంగాల ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో  మరో   నిందితుడు  పరారీలో ఉన్నాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి మొత్తం 19 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 215 గ్రాముల బంగారం,  ఒక కారు, ఒక బుల్లెట్ వాహనం సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఎల్‌బీన‌గ‌ర్ సంతోషిమాత దేవాల‌యం (santoshimatha temple) లో చోరీకి గురైన అమ్మ‌వారి న‌గ‌ల‌ను సైతం వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామ‌ని (rachakonda cp mahesh bhagwat) తెలిపారు. 

కాగా, ఈ అంత‌రాష్ట్ర దొంగ‌ల ముఠా వివిధ రాష్ట్రాల్లో నేరాల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని రాచకొండ సీపీ మ‌హేష్ భ‌గ‌త్ వెల్ల‌డించారు. ఈ చోరీ గ్యాంగ్ లోని నిందితుల పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. గతంలో నాలుగు దేవాలయాల్లో చోరీలు చేశార‌ని పేర్కొన్నారు. నిందితులపై దేవాల‌యాల్లో (temple) దొంగ‌త‌నాల‌కు సంబంధించిన కేసులతో పాటు  హౌస్ బ్రోకింగ్, ఆటో మోబైల్స్ కేసులు కూడా నమోదు  అయ్యాయని సీపీ మహేష్ భగత్ (rachakonda cp mahesh bhagwat) మీడియాకు తెలియజేశారు. 

click me!