తెలంగాణలో కోవిడ్ ఉద్ధృతి.. 7,31,212కి చేరిన కేసుల సంఖ్య

By Siva KodatiFirst Published Jan 22, 2022, 8:42 PM IST
Highlights

తెలంగాణలో (corona cases in telangana) కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 1,16,224 నమూనాలను పరీక్షించగా 4,393 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 7,31,212కి చేరింది. ఇవాళ 2,319 మంది వైరస్ (corona deaths in telangana) నుంచి కోలుకోగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో (corona cases in telangana) కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 1,16,224 నమూనాలను పరీక్షించగా 4,393 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 7,31,212కి చేరింది. ఇవాళ 2,319 మంది వైరస్ (corona deaths in telangana) నుంచి కోలుకోగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.18శాతంగా ఉన్నట్లు పేర్కొంది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,643 మందికి పాజిటివ్‌గా తేలింది. తెలంగాణలో ప్రస్తుతం 31,199 యాక్టీవ్ కేసులున్నాయి. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,071కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 53, భద్రాద్రి కొత్తగూడెం 70, జీహెచ్ఎంసీ 1643, జగిత్యాల 65, జనగామ 37, జయశంకర్ భూపాలపల్లి 28, గద్వాల 38, కామారెడ్డి 57, కరీంనగర్ 89, ఖమ్మం 128, మహబూబ్‌నగర్ 93, ఆసిఫాబాద్ 31, మహబూబాబాద్ 77, మంచిర్యాల 88, మెదక్ 56, మేడ్చల్ మల్కాజిగిరి 421, ములుగు 28, నాగర్ కర్నూల్ 72, నల్గగొండ 67, నారాయణపేట 31, నిర్మల్ 37, నిజామాబాద్ 65, పెద్దపల్లి 98, సిరిసిల్ల 61, రంగారెడ్డి 286, సిద్దిపేట 70, సంగారెడ్డి 89, సూర్యాపేట 63, వికారాబాద్ 78, వనపర్తి 58, వరంగల్ రూరల్ 67, హనుమకొండ 184, యాదాద్రి భువనగిరిలో 65 చొప్పున కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,37,704 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయితే వరుసగా మూడో రోజు కూడా దేశంలో 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,89,03,731కి చేరింది. మరోవైపు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం కేసుల సంఖ్య పదివేలు దాటేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 488తో మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,88,884కి చేరింది. గత 24 గంటల్లో 2,42,676 కరోనాను జయించారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,63,01,482కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,13,365 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక, దేశంలో కరోనా పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. రోజువారి పాజివిటీ రేటు 17.22 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 16.65 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93.31 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 5.43 శాతం, మరణాల రేటు 1.26 శాతంగా ఉంది. 
అటు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 10,050 Omicron కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది కిందటి రోజుతో పోలిస్తే 3.69 శాతం కంటే అధికం అని తెలిపింది. 

click me!