ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై టీఎస్‌పీఎస్‌సీ ఇవాళ చర్చించనుంది. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ పరీక్ష విషయమై టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ మంగళవారంనాడు మధ్యాహ్నం సమావేశం జరగనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరో వైపు ప్రశ్నాపత్రాల లీకేజీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్, రాజశేఖర్ లపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేటు వేసింది.
ఈ నెల 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన రెండు ప్రశ్నాపత్రాలు లీకైనట్టుగా అనుమానం రావడంతో ఈ రెండు పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ నెల 12న టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఈ నెల 15,16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలపై పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. అయితే టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైందనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. అయితే టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ ప్రశ్నాపత్రం లీకైందని పోలీసులు తమ దర్యాప్తులో నిర్ధారించారు. అయితే ఈ ప్రశ్నాపత్రం చేరిన అభ్యర్ధులను పరీక్ష నుండి తప్పించాలా లేదా పరీక్షను రద్దు చేయాలా అనే విషయమై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.
also read:టీఎస్‌పీఎస్‌సీలో మరో ప్రశ్నాపత్రం లీక్: 11 మంది అరెస్ట్
మరో వైపు ప్రశ్నాపత్రాల లీకేజీలో టీఎస్‌పీఎస్‌సీలో సెక్రటరీ పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ను సస్పెండ్ చేశారు. మరో వైపు ఔట్ సోర్సింగ్ ద్వారా టీఎస్‌పీఎస్‌సీ లో పనిచేస్తున్న రాజశేఖర్ ను తొలగించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.