దీర్ఘాయుష్షు కోసం ప్రార్ధిస్తున్నా: కేసీఆర్‌కి మోడీ బర్త్‌డే గ్రీటింగ్స్

Published : Feb 17, 2023, 10:38 AM ISTUpdated : Feb 17, 2023, 10:48 AM IST
 దీర్ఘాయుష్షు కోసం  ప్రార్ధిస్తున్నా: కేసీఆర్‌కి మోడీ బర్త్‌డే గ్రీటింగ్స్

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌  పుట్టిన రోజును  పురస్కరించుకొని  ప్రముఖులు  ఆయనకి  గ్రీటింగ్స్  చెప్పారు. ప్రధాని మోడీ సహ  పలువురు  కేసీఆర్ కి  బర్త్ డే విషెష్ తెలిపారు.  

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  శుక్రవారం నాడు పుట్టిన రోజు  శుభాకాంక్షలు తెలిపారు.  ట్విట్టర్ వేదికగా  కేసీఆర్ కి  ప్రధాని మోడీ  గ్రీటింగ్స్ తెలిపారు.  కేసీఆర్‌కి   దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం  కోసం  ప్రార్ధిస్తున్నట్టుగా  మోడీ చెప్పారు. 

 

 కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని  తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  ట్విట్టర్ వేదికగా  శుభాకాంక్షలు తెలిపారు.  కేసీఆర్ అంటే కారణ జన్ముడు అంటూ  హరీష్ రావు  పేర్కొన్నారు.  కేసీఆర్  నిండు నూరేళ్లు వర్ధిల్లాలని  ఆయన  ఆకాంక్షను వ్యక్తం  చేశారు. 

 

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి  సంతోషకరమైన  జీవితం , ఆరోగ్యకరమైన  జీవితం  అందించాలని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  కోరుకున్నారు.  కేసీఆర్ కి  పవన్ కళ్యాణ్ పుట్టిన  రోజు  శుభాకాంక్షలు తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?