తమిళిసై రాజీనామా ఆమోదం: తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్ నియామకం

By narsimha lode  |  First Published Mar 19, 2024, 10:32 AM IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్  రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.  కొత్త గవర్నర్ ను కూడ రాష్ట్రపతి నియమించారు.


హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ ను రాష్ట్రపతి నియమించారు. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు  తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడ రాధాకృష్ణన్ బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు. తెలంగాణ గవర్నర్ గా కొనసాగిన తమిళిసై సౌందరరాజన్  తన పదవికి సోమవారం నాడు రాజీనామా చేశారు.  తమిళిసై రాజీనామాను  రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ఆమోదించారు.  జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు  అదనపు బాధ్యతలు అప్పగించారు.

also read:నాదెండ్లతో వంగవీటి రాధా భేటీ: పొలిటికల్ వర్గాల్లో చర్చ

Latest Videos

తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందర రాజన్  త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతుంది.ఈ కారణంతోనే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టుగా  ప్రచారంలో ఉంది.  

also read:తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్: నాలుగు రోజులపాటు వర్షాలు

గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో తూత్తుకూడి పార్లమెంట్ స్థానం నుండి  తమిళిసై సౌందరరాజన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ నాయకత్వం తనకు టిక్కెట్టు ఇస్తే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని తమిళిసై సౌందర రాజన్ ఇటీవల కాలంలో ప్రకటించారు.త్వరలో జరిగే ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ పోటీ చేస్తారనే ప్రచారం కూడ సాగుతుంది.

also read:గెలుపు గుర్రాల కోసం అన్వేషణ: 13 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా తమిళిసై సౌందరరాజన్  రాజీనామా చేశారు.తమిళనాడులోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి తమిళిసై సౌందరరాజన్  పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని పలు పార్లమెంట్ స్థానాల నుండి తమిళిసై పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది.అయితే బీజేపీ నాయకత్వం తమిళిసై సౌందర రాజన్ కు ఏ స్థానం కేటాయిస్తారనేది త్వరలోనే తేలనుంది.  తెలంగాణ గవర్నర్ పదవిని చేపట్టడానికి ముందుగా  తమిళిసై సౌందర రాజన్  బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.

click me!