తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కూడ పడ్డాయి. అకాల వర్షంతో రైతులు నష్టపోయారు. వేసవి ప్రభావంత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
also read:గెలుపు గుర్రాల కోసం అన్వేషణ: 13 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ తదితర ప్రాంతాల్లో వడగళ్లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో 40 కి.మీ వేగంతో గాలులు కూడ వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.
also read:ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు: టిక్కెట్లు ఎవరికో?
హైద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డితో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖాధికారులు.ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఈ తరుణంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో కొంత రిలీఫ్ ఇచ్చినట్టైంది. అయితే ఈ వర్షాలు రైతులకు నష్టం కలిగిస్తున్నాయి.సాధారణంగా ప్రతి వేసవిలో వడగళ్ల వానలు కురుస్తుంటాయి.