ఈ నెల 21న ప్రణయ్ సంస్మరణ సభ

Published : Oct 12, 2018, 12:21 PM IST
ఈ నెల 21న ప్రణయ్ సంస్మరణ సభ

సారాంశం

ఈ నెల 21న ప్రణయ్ సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు అమృతప్రణయ్‌ న్యాయపోరాట సంఘీభావ కమిటీ అధికారికంగా ప్రకటించింది. అసలు ఈనెల 14వ తేదీనే సభ నిర్వహించాల్సి ఉంది. అయితే.. కొన్ని అనివార్య కారణాల వల్ల సభను వాయిదా వేశారు.

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ సంస్మరణ సభను ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నారు. తమ కుమార్తె తక్కువ కులస్థుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్ష్యతో అమృత తండ్రి మారుతీరావు..ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించాడు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. న్యాయం కోసం అమృత పోరాటం సాగిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 21న ప్రణయ్ సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు అమృతప్రణయ్‌ న్యాయపోరాట సంఘీభావ కమిటీ అధికారికంగా ప్రకటించింది. అసలు ఈనెల 14వ తేదీనే సభ నిర్వహించాల్సి ఉంది. అయితే.. కొన్ని అనివార్య కారణాల వల్ల సభను వాయిదా వేశారు.

ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత పీడిత, బహుజన, కుల పో రాట, కుల నిర్మూలన సంఘాల ప్రతినిధులతోపాటు ప్రజాస్వామికవాదులు, మేథావులు అధిక సంఖ్యలో తరలివస్తున్నట్లు సభ్యులు వివరించారు. మానవతావాదులు, అమృతప్రణయ్‌ మద్దతుదారులు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.

related news

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు