సిరిసిల్లలో మరమగ్గాల కార్మికుల సమ్మె: నిలిచిపోయిన బతుకమ్మ చీరల ఉత్పత్తి

By narsimha lode  |  First Published Mar 24, 2022, 10:07 AM IST

సిరిసిల్లలో మరమగ్గాల కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో బతుకమ్మ చీరల ఉత్పత్తి నిలిచిపోయింది. తమ డిమాండ్ల సాధన కోసం మర మగ్గాల కార్మికులు సమ్మె చేస్తున్నారు.


సిరిసిల్ల: మరమగ్గాల కార్మికుల సమ్మెతో  బతుకమ్మ చీరల ఉత్పత్తి  నిలిచిపోయింది. గత నాలుగు రోజులుగా Power Loomకార్మికులు సమ్మె చేస్తున్నారు. కూలీ రేట్లు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రతి ఏటా Dussehraకు ముందు Bathukamma చీరల ఉత్పత్తి సిరిసిల్లలో తయారు చేస్తున్నారు. సిరిసిల్లలోని మరమగ్గాల్లోనే బతుకమమ Sarees ఉత్పత్తి చేస్తున్నారు. అయితే నాలుగు రోజులుగా మరమగ్గాల workers ఆందోళనలు చేస్తున్నారు. దీంతో మరమగ్గాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కూలీ రేట్లు పెంచడంతో పాటు వస్త్ర ఉత్పత్తికి అవసరమైన మెటిరీయల్ కు సబ్సిడీని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest Videos

undefined

Telanganaలో దసరా పండుగను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకొంటారు. దసరాకు ముందు బతుకమ్మ పండుగ వస్తుంది. అయితే బతుకమ్మ సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. అయితే బతుకమ్మ  పండుగ సందర్భంగా మహిళలకు చీరలను 2017 నుండి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.

2017 సెప్టెంబరు 18, 19, 20 తేదీలలో  1,04,57,610 మందికి రేషన్ షాపుల ద్వారా   బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
2018లో రూ.280 కోట్ల వ్యయంతో 80 రంగుల్లో 95లక్షల జరీ అంచు పాలిస్టర్‌ చీరలను మరమగ్గాలపై తయారుచేయించారు. అక్టోబరు 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం జరగాల్సివుండగా ఎన్నికల కోడ్ తో చీరల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున చీరల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబరు 19న చీరల పంపిణీ చేశారు.

2019లో కోటి బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం 313 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 16 వేలమంది నేత కార్మికులు 26 వేల మగ్గాలపై ఈ చీరలను తయారుచేశారు. 10 రకాల డిజైన్స్‌తో 10 రకాల రంగులతో 10 లక్షల చీరలను 9 మీటర్ల పొడవు, మిగతా 90 లక్షల చీరలు 6 మీటర్ల పొడుగుతో తయారు చేశారు. 2019 సెప్టెంబరు 23 నుంచి చీరల పంపిణీ చేశారు.

2020లో 287 డిజైన్లలో చీరల తయారీకి రూ.317 కోట్లు ఖర్చు చేశారు. సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లోని మరమగ్గాలపై ఈ చీరలు తయారయ్యాయి. కరోనా నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్ళి చీరలను అందజేశారు. ఆ సమయంలో చీరలు  తీసుకోలేని వారికి  2020 అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేశారు.

 2021లో కోటి బతుకమ్మ చీరల తయారీకి 318 కోట్ల రూపాయలను ఖర్చుచేశారు. దాదాపు 16 వేల మగ్గాలపై పదివేల నేత కుటుంబాలు ఆరునెలలపాటు శ్రమించి చీరలను తయారు చేశాయి. గతంలో మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించి, ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 రంగులతో, డాబీ అంచుతో సరికొత్తగా రూపొందించారు. వృద్ధులకు 6.3 మీటర్లు, ఇతరులకు 5.5 మీటర్ల చీరలను తయారు చేశారు. సిరిసిల్లలో 75 లక్షలు, వరంగల్లులో 13 లక్షలు, karimnagar లో 12 లక్షల చీరలు తయారుచేశారు.

click me!