203 జీవోను అడ్డుకోవాలి, ఛలో పోతిరెడ్డిపాడు నిర్వహిస్తా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By narsimha lodeFirst Published May 13, 2020, 4:05 PM IST
Highlights

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో అమలు కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
 


హైదరాబాద్: పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో అమలు కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

బుధవారంనాడు ఆయన సీఎంకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.తక్షణమే పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచేందుకు ఏపీ పనులు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు. కృష్ణా బేసిన్ లోని  రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. 

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: కృష్ణా రివర్ బోర్డు భేటీ

రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.తెలంగాణ ప్రజల తరపున ఉద్యమిస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ లేఖలో హెచ్చరించారు. ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడ ఆయన హెచ్చరించారు.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుండి 80 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ జీవోపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. తెలంగాణకు చెందిన విపక్షాలు కూడ ఈ జివోను వ్యతిరేకిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ తీరును ఎండగడుతూ ఆందోళనలను నిర్వహించాయి.
 

click me!