88వేల క్యూసెక్కులు తరలించే ప్లాన్: పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్

Published : May 13, 2020, 02:02 PM ISTUpdated : May 13, 2020, 02:16 PM IST
88వేల క్యూసెక్కులు తరలించే ప్లాన్: పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్

సారాంశం

:ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కొత్త ప్రాజెక్టులను నిలిపివేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్టుగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ తెలిపారు.

హైదరాబాద్:ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కొత్త ప్రాజెక్టులను నిలిపివేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్టుగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ్ ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తప్పుబట్టారు.

also read:పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ప్రారంభమైతే కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్

88 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తరలించాలని ఈ జీవోలో ఏపీ ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సుమారు 8 టీఎంసీల ప్రతిపాదనలు పెట్టారని ఆయన గుర్తు చేశారు. కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్ లో ఇంకా కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ విషయం పరిష్కారం కాకముందే కొత్త ప్రాజెక్టులు కట్టేందుకు ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ చేయడం సరైంది కాదన్నారు. 

కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అని ఆయన చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి  లేకుండానే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ పూనుకొందన్నారు.ఈ విషయమై తమ అభ్యంతరాలను తెలుపుతూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాసినట్టుగా ఆయన తెలిపారు. 

also read:పోతిరెడ్డిపాడుపై వివాదాస్పద జీవోలు: నాడు వైఎస్ఆర్, నేడు జగన్

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు ఈ నెల 5వ తేదీన 203 జీవో జారీ చేసింది.ఈ జీవో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చును రేపింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ద్యాన్ని పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పాటు విపక్షాలు  కూడ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.తెలంగాణలోని నల్గొండ, మహాబూబ్ నగర్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.దీంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. 


 

PREV
click me!

Recommended Stories

Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న
Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu