కెసిఆర్ కు దమ్ముంటే ఆ పని చేయాలి

Published : Aug 26, 2017, 01:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కెసిఆర్ కు దమ్ముంటే ఆ పని చేయాలి

సారాంశం

కోర్టులు మొట్టికాయ వేయకుండా జిఓలు ఇవ్వాలి ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు నేను సిద్ధం నువ్వొచ్చినా, హరీష్ వచ్చినా రెడీ ప్రాణహిత జాతీయ హోదా ఎందుకు అడుగుతలేరు?

మాజీ మంత్రి, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సిఎం కేసిఆర్ పై ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కు పిలిపించుకున్న నేతలతో సీఎం డబ్బా కొట్టించుకుంటున్నారని విమర్శించారు. .ప్రభుత్వానికి దమ్ముంటే న్యాయ స్థానాలు మొట్టికాయలు వేయకుండా, కోర్టు అడ్డంకులు రాకుండా జీవో లు ఇవ్వండి అని సవాల్ విసిరారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రాజెక్టు ల పై బహిరంగ చర్చకు రావాలి..! కేసీఆర్ వస్తారో.. ! హరీష్ వస్తారో..! ఎవరు వచ్చినా నేను రెఢీ అని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం పై ప్రాభిప్రాయ సేకరణ టీఆరెస్ నేతల బహిరంగ సభల మాదిరిగా మారాయని ఎద్దేవా చేశారు. పోలీసులతో బెదిరిస్తూ బాధితులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిని బలవంతంగా బయటకు వెళ్లగొడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ ల పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యల కు పాల్పడుతుందని ఆరోపించారు. తెలంగాణల నిరంకుశ, ఆటవిక గడిల పాలన సాగుతోందన్నారు.

 2015 నవంబర్ వరకు ప్రాణహిత కు జాతీయ హోదా ఆడిగిన కేసీఆర్.. ఆతర్వాత డిజైన్ మార్పు ఎెందుకు తీ సుకున్నారని ప్రశ్నించారు. .ప్రాజెక్ట్ లకు, ప్రజలు, కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. .ప్రజలను ముంచి ప్రాజెక్టులంటేనే వ్యతిరేకిస్తామన్నారు. ఇష్టా నుసారం చేస్తామంటే ఊర్కోమని హెచ్చరించారు. ప్రతి రైతును ఒప్పించి గతంలో కాంగ్రెస్ ప్రాజెక్టులు నిర్మించిందని గుర్తు చేశారు. తెలంగాణ సర్కారు కూడా అలాగే వ్యవహరించాలని సూచించారు.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీచర్ అవతారమెత్తిన సీఎం

 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్