ఓరుగల్లులో కొలువుదీరిన ఆమ్రపాలి గణేష్

First Published Aug 25, 2017, 8:01 PM IST
Highlights
  • వరంగల్ యువకుల అద్భుత సృష్టి
  • ఆమ్రపాలి గణేష్ కు రూపకల్పన
  • ఆసక్తికరంగా మారిన కొత్త గణేష్
  • బారులు తీరిన జనాలు
  • ఆమ్రపాలి కూడా వచ్చే చాన్స్

వరంగల్ జిల్లాలో సరికొత్త రికార్డు నెలకొంది. వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పేరు మీద ఈ రికార్డు నెలకొనడం ఆసక్తికరంగా మారింది. వరంగల్ అర్బన్ పరిధిలోని కొందరు యువకులు వెరైటీ గణేష్ నెలకొల్పే క్రమంలో ఏకంగా ఆమ్రపాలి ఒడిలో గణేషుడు కొలువుదీరినట్లు విగ్రహాన్ని రూపొందించి అందరినీ ఆకర్షిస్తున్నారు. 

వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి పనితీరుపై ఆట్రాక్ట్ అయిన కొంతమంది ఆమెకు ఫ్యాన్స్‌గా మారిపోయారు. అభిమానానాన్ని సరి కొత్తగా చూపించారు. దీనికి వినాయకచవితి పండుగను వేదికగా చేసుకున్నారు. ఖాజీపేట బాపూజీ నగర్ యువత వినాయకచవితి సందర్భంగా మండపం ఏర్పాటు చేసుకున్నారు.

అందరిని ఆకట్టుకునేలా తమ వినాయకున్ని రూపొందించాలనుకున్నారు. 'బాహుబలి'లా పెట్టినా, రోబో లా విగ్రహాన్ని నెలకొల్పినా మరోలా పెట్టిన రోటీన్ అయిపోతుందని అనుకున్నారు. బాగా ఆలోచించి వారు కలెక్టర్ ఆమ్రపాలి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. ఆమ్రపాలి కూర్చున పోజీషన్లో ఆమె చేతుల్లో వినాయకుడు ఉండేలా డిజైన్ రెడీ చేసి విగ్రహాన్ని తయారు చేయించారు.

ఈ వినాయకుడి విగ్రహాన్ని చూసేందుకు నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి జనాలు తరలివస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి అందరి దృష్టిని ఆకర్షించడం కోసం చేపట్టిన ఈ కార్యం లో తాము విజయం సాధించామని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిని కూడా ఆహ్వానించనున్నట్లు చెబుతున్నారు. మరి ఆమ్రపాలి అక్కడ ఎప్పుడు సందర్శిస్తారా అన్నది చర్చనీయాంశమైంది.

click me!