పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం ఆత్మహత్య: ఇన్నాళ్లకు దొరికిన సూసైడ్ నోట్

By Siva KodatiFirst Published Jun 22, 2020, 6:47 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధా కుటుంబం మృతిపై మిస్టరీ వీడింది. కాల్వలోకి కారు దూసుకెళ్లడం ప్రమాదం కాదని.. ఉద్దేశ్యపూర్వకంగా చేసినదేనని తేల్చిన పోలీసులు రాధిక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్థారించారు.

Also Read:రాధిక కుటుంబం జల సమాధి: సీసీ కెమెరాల్లో కారు గుర్తింపు

ఎమ్మెల్యే బావ, రాధిక భర్త సత్యనారాయణ రెడ్డిలో ఈ మేరకు సూసైడ్ నోట్ దొరకడంతో కేసు చిక్కుముడి వీడింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లా యాదాలపల్లి సమీపంలోని అలుగునూరు వద్ద కాకతీయ కెనాల్‌లో కారును గమనించిన స్థానికులు పోలీసులకు  సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును వెలికి తీయగా.. అందులో కుళ్లిన స్థితిలో ఉన్న మూడు మృతదేహాలు లభించాయి. తొలుత గుర్తు తెలియని వ్యక్తులుగా భావించిన పోలీసులు... కారు నెంబర్ ఆధారంగా ఎమ్మెల్యే కుటుంబసభ్యులుగా గుర్తించారు. వీరిని ఎమ్మెల్యే సోదరి రాధిక, బావ సత్యనారాయణ రెడ్డి, కుమార్తె వినయశ్రీగా గుర్తించారు. 

Also Read:సోదరి రాధిక ఫ్యామిలీ మృతి: అదృశ్యంపై ఎమ్మెల్యేకు ముందే తెలిసినా... అనుమానాలు

నిజానికి జనవరి 28వ తేదీన రాధిక కుటుంబసభ్యులు మిస్సయ్యారు. అయితే 22 రోజుల తర్వాత కాకతీయ కెనాల్‌లో వీరి కారు లభించింది. రాధిక ప్రభుత్వ ఉపాధ్యాయురాలి, భర్త సత్యనారాయణ రెడ్డి ఫెర్టిలైజర్స్ వ్యాపారం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సత్యనారాయణ రెడ్డి షాపులో దొరికిన డైరీలో కీలక ఆధారాలు లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. 
 
click me!