కోరుకొన్న శాఖలో ఉద్యోగం: సంతోష్ భార్యకు కేసీఆర్ హామీ

Published : Jun 22, 2020, 05:53 PM ISTUpdated : Jun 25, 2020, 05:30 PM IST
కోరుకొన్న శాఖలో ఉద్యోగం: సంతోష్ భార్యకు కేసీఆర్ హామీ

సారాంశం

: ఏ శాఖలో కావాలంటే ఆ శాఖలో ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని కల్నల్ సంతోష్ భార్య సంతోషి తెలిపారు. 

హైదరాబాద్: ఏ శాఖలో కావాలంటే ఆ శాఖలో ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని కల్నల్ సంతోష్ భార్య సంతోషి తెలిపారు. 

సోమవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. సంతోషికి డిప్యూటీ కలెక్టర్ నియామకపత్రాలను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.ఎప్పుడు ఏ సహాయం చేయాలన్నా చేస్తామని కూడ సీఎం హామీ ఇచ్చారన్నారు.  

also read:సంతోష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ పరామర్శ: ఉద్యోగం, ఇంటి స్థలం, రూ. 5 కోట్ల చెక్ అందజేత

తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చినట్టుగా తెలిపారు. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తన వద్దకు రావాలని కూడ సూచించారన్నారు.

వీలు చూసుకొని తన ఇంటికి భోజనానికి రావాలని సీఎం కేసీఆర్ కోరారని ఆమె తెలిపింది.తమ కుటుంబానికి ఇచ్చిన హామీని అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తమ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని సంతోష్ బాబు తల్లి చెప్పారు.మీ అబ్బాయిని తీసుకురాలేకపోయినా... చేతనైనంత సహాయం చేస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారన్నారు.

ఇదిలా ఉంటే సూర్యాపేటలో ఏదో ఒక చౌరస్తాకు సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేయనున్నట్టుగా మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అంతేకాదు సూర్యాపేటలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

PREV
click me!

Recommended Stories

యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family