లాక్‌డౌన్ విద్యుత్ బిల్లులు మాఫీ: కౌంటర్ దాఖలుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Jun 22, 2020, 4:50 PM IST
Highlights

లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారించింది. 

హైదరాబాద్: లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారించింది.  ఈ విషయమై ప్రభుత్వానికి, టీఎస్ఎస్‌పీడీసీఎల్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

శ్లాబులు సవరించి విద్యుత్ బిల్లులను తగ్గించాలని పిటిషనర్లు కోరారు. విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటి ఉందని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. 

ఇప్పటికే 6,767 ఫిర్యాదులకు 6,678 సమస్యలు పరిష్కరించామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. విద్యుత్ బిల్లుల సమస్య పరిష్కారం కోసం కమిటీ ఉన్నందున తాము జోక్యం చేసుకోవడం సరికాదని  హైకోర్టు తెలిపింది. 

కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 23 నుండి లాక్ డౌన్ అమల్లో ఉంది.  కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పలు రంగాల్లో లాక్ డౌన్ ఆంక్షలను తెలంగాణలో కూడ ఎత్తివేశారు.

దీంతో ఈ నెల మొదటివారంలో విద్యుత్ బిల్లుల రీడింగ్ తీశారు. విద్యుత్ బిల్లులు సాధారణం కంటే ఎక్కువగా వచ్చాయి.  విద్యుత్ బిల్లులపై ఫిర్యాదులు ఉంటే చేయాలని కూడ తెలంగాణ విద్యుత్ శాఖ ప్రకటించింది.

click me!