రెండు రోజులుగా బీజేపీ ఆఫీస్ వద్ద నానో కారు: ఆబిడ్స్ పోలీసుల తనిఖీలు

Published : Aug 16, 2022, 01:58 PM ISTUpdated : Aug 16, 2022, 02:18 PM IST
 రెండు రోజులుగా బీజేపీ ఆఫీస్ వద్ద నానో కారు: ఆబిడ్స్ పోలీసుల తనిఖీలు

సారాంశం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ముందు రెండు రోజులుగా పార్క్ చేసిన నానో కారుపై అనుమానంతో  ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉంది. 

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ముందు రెండు రోజులుగా పార్క్ చేసిన నానో కారుపై అనుమానంతో ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నానో కారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉంది. రెండు రోజులుగా బీజేపీ కార్యాలయం వద్దే ఈ కారు పార్క్ చేసి ఉండడంతో  అనుమానంతో బీజేపీ శ్రేణులు ఆబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో పెద్ద సూట్ కేసు లభ్యమైంది. ఈ సూట్ కేసు డాగ్ స్క్వాడ్ బృందం పరిశీలిస్తుందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. కారు లోపల కూడ డాగ్ స్క్వాడ్ బృందం పరిశీలించనుంది. అయితే  కారు తాళం వేసి ఉన్నందున ఈ కారు తాళం పగులగొట్టి కారు లోపల తనిఖీలు చేయనున్నారు పోలీసు సిబ్బంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే