తెలంగాణ గవర్నర్ ను కేసీఆర్ అవమానిస్తున్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Aug 16, 2022, 1:00 PM IST

తెలంగాణ గవర్నర్ ను కేసీఆర్ అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వ్యవస్థలను, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసవరం కేసీఆర్ పై ఉంద్నారు. తన కొడుకు సీఎం కాడేమోననే ప్రస్టేషన్ తో కేసీఆర్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.


హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ ను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 

మంగళవారం నాడు కేంద్ర మంత్రికిషన్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు నిర్వహించినట్టుగానే తెలంగాణ లో కూడా ఎట్ హోం కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎంం తొలుత రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారని చెప్పారు. సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నాలను కేసీఆర్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన కాళ్ల కింద భూమి కదిలిపోతోందనే భయంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. అంతేకాదు తన కొడుకు సీఎం కాడేమోననే భయం కేసీఆర్ ను వెంటాడుతుందని కిషన్ రెడ్డి చెప్పారు.  రాష్ట్రంలో ఒక తప్పుపై మరో తప్పును కేసీఆర్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వ్యవస్థలు, సంప్రదాయాలను గౌరవించాలని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు సూచించారు.

Latest Videos

undefined

టీఆర్ఎస్ ను పాతరేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్రానికి కేసీఆర్ సర్టిఫికెట్లు అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు ఏం  చేశారని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.  బీజేపీలో చేరాలనుకునే వారిపై కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయిస్తుందని కేంద్ర మంత్రి ఆరోపించారు.

also read:7 గంటలకు వస్తానని కేసీఆర్ సమాచారం ఇచ్చారు: ఎట్ హోం కార్యక్రమంపై తమిళిసై 

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ లో నిన్న ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వస్తారని రాజ్ భవన్ కు సమాచారం అందింది. సాయంత్రం 6:55 గంటలకు  రానున్నట్టుగా సీఎంఓ నుండి సమాచారం రావడంతో అదే సమయానికి తామంతా రాజ్ భవన్ లో ఎదురు చూసినట్టుగా తమిళిసై చెప్పారు. సీఎం కేసీఆర్ కోసం అరగంటపాటు ఎదురు చూసిన తర్వాత ఎట్ హోం కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా గవర్నర్ తెలిపారు. ఎట్ హోం కార్యక్రమానికి రావడం లేదని తమకు సమాచారం రాలేదని గవర్నర్ ప్రకటించారు. 
 

click me!