వ్యభిచార కూపం నుండి మైనర్ బాలికకు విముక్తి

By narsimha lodeFirst Published Dec 21, 2018, 5:02 PM IST
Highlights

జడ్చర్ల వ్యభిచార గృహంలో చిక్కుకొన్న ఓ బాలికకు పోలీసులు విముక్తి కల్పించారు. మైనర్ బాలికకు  మాయా మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి  మార్చేందుకు ప్రయత్నించిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

జడ్చర్ల: జడ్చర్ల వ్యభిచార గృహంలో చిక్కుకొన్న ఓ బాలికకు పోలీసులు విముక్తి కల్పించారు. మైనర్ బాలికకు  మాయా మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి  మార్చేందుకు ప్రయత్నించిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైద్రాబాద్‌ చైతన్యపురిలోని  ఎన్టీఆర్ నగర్  సమీపంలో మైనర్ బాలిక తల్లితో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఆ బాలికకు చంటి అనే డ్రైవర్ అతని భార్య పుష్ప మాయా మాటలు చెప్పి  ఈ నెల 10వ తేదీన జడ్చర్లకు తీసుకెళ్లారు.

వ్యభిచారం చేయాలని  ఆ బాలికపై ఒత్తిడి తెచ్చారు. జడ్చర్లలో చంటి భార్య మరికొందరు మహిళలతో  వ్యభిచార గృహన్ని నిర్వహిస్తోంది.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ నిర్వహించారు. ఈ విచారణలో చంటి మైనర్ బాలికను  జడ్చర్లకు తీసుకెళ్లారని  గుర్తించారు.

పోలీసులు జడ్చర్లలో చంటి నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేశారు. మైనర్ బాలికతో పాటు ఏడుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చంటి భార్య కూడ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
 

click me!