బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌కు బిగ్ రిలీఫ్

Siva Kodati |  
Published : May 29, 2022, 02:23 PM IST
బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌కు బిగ్ రిలీఫ్

సారాంశం

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏపీ జేమ్స్ అండ్ జ్యువెలరీకి చెందిన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన కేసులో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌కు ఊరట లభించింది. ఆయన పేరును కేసు నుంచి తొలగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

బీజేపీకి (bjp) చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్‌కు (tg venkatesh) భారీ ఊర‌ట లభించింది. భూక‌బ్జా కేసులో ఆయ‌న పేరును తొల‌గిస్తూ హైద‌రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు (banjarahills police) నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవ‌ల జూబ్లీహిల్స్ ప‌రిధిలోని ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెల‌రీస్‌కు కేటాయించిన స్థలాన్ని ఆక్ర‌మించేందుకు క‌ర్నూలు జిల్లాకు (kurnool district) చెందిన కొంద‌రు వ్య‌క్తులు య‌త్నించిన వ్యవహారం దుమారం రేపింది. భారీ అనుచర గణంతో వ‌చ్చిన స‌ద‌రు ముఠా... ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెల‌ర్స్‌కు (ap gems and jewellery) చెందిన సెక్యూరిటీ గార్డుల‌పై దాడి చేసింది. 

Also Read:సీమలో రెండో రాజధాని పెట్టాలి: టీజీ వెంకటేశ్ డిమాండ్

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ముఠా సభ్యుల‌ను అరెస్ట్ చేశారు. ఈ ముఠాను తీసుకుని వ్యక్తి వ‌చ్చిన టీజీ వెంక‌టేశ్ స‌మీప బంధువు టీజీ విశ్వ ప్ర‌సాద్ (tg vishwa prasad) అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్య‌వ‌హారంపై వివ‌రాలు సేక‌రించిన పోలీసులు... అరెస్టైన నిందితులు చెప్పిన వివ‌రాల మేర‌కు రాజ్యసభ  సభ్యుడు టీజీ వెంక‌టేశ్ పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఈ వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన టీజీ వెంక‌టేశ్ ఈ ఘ‌ట‌న‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వెల్లడించారు. అయినప్పటికీ పోలీసులు ఆయ‌న పేరును కేసు నుంచి తొల‌గించ‌లేదు. ఈ కేసులో మ‌రింత క్లారిటీ రావడంతో పోలీసులు టీజీ వెంక‌టేశ్ పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొల‌గించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్