
చాందినీ జైన్ హత్య లోని మిస్టరీ విజయవతంగా ఛేదించిన తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ సాండిల్యా మీడియాతో మాట్లాడారు
విశేషాలు
సైబరాబాద్ & సంగారెడ్డి పోలీస్ లు సంయుక్తంగా, త్వరితగతిన 3 రోజుల్లోనే చాందిని కేస్ ను ఛేదించారు.ఈ నెల 10 న చాందిని అదృశ్యం అయిందని మియపూర్ పోలీస్ స్టేషన్ లో చాందిని అక్క నివేదిత జైన్ కంప్లైంట్ ఇచ్చింది. కేస్ నమోదు చేసుకున్న పోలీస్ లు నివేదిత చెప్పిన ఆధారంగా చాందిని కాల్ డేటాను, ఫ్రెండ్స్ లిస్ట్ లను సేకరించాము.ఈ లోపు 12 న అమీన్ పుర్ గుట్టలో అమ్మాయి మృతదేహం ఉన్నట్లు సంగారెడ్డి పరిధిలోని అమీన్పూర్ పోలీస్ లకు స్థానికులు సమాచారం అందించారు. 6 నెలల క్రితమే అమీన్పూర్ పరిధి లో CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాల ఆధారంగా చాందిని మరో యువకుడు గుట్టల్లోకి వెళ్తున్నట్లు రికార్డ్ అయ్యింది.
యువకుడి మొహం స్పష్టంగా కనపడకపోవడం తో తిరిగి వస్తారనే ఉద్దేశంతో CCTV కెమెరాలను పరిశీలించారు. కానీ నిందితుడు మరో మార్గం ద్వారా వెళ్లడం తో కేస్ ను మరింత క్షుణ్ణంగా పరిశీలించారు.చాందిని, నిందితుడు వెళ్లిన ఆటో నెంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్ ను ప్రశ్నించారు. కానీ యువకుడు మొహానికి కర్చీఫ్ కట్టుకున్నడని డ్రైవర్ చెప్పాడు.చివరగా చాందిని కాల్ డేటా ను పరిశీలించగా సాయి కిరణ్ రెడ్డి నెంబర్ కు ఎక్కువగా కాల్ చేయడం తో సాయిని పోలీస్ లు అడుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
చాందిని ని సాయి కిరణ్ చంపినట్లు విచారణ లో ఒప్పుకున్నాడు.గుట్టల్లోకి వెళ్ళాక చాందిని పెళ్లి చేసుకోవాలని నిలదీయడం తో సాయి కిరణ్ ఆమెను హతమార్చాడు.చాందిని గొంతు నులిమి గుట్టల్లోకి తోసేసినట్లు సాయి కిరణ్ పేర్కొన్నాడు.చాందిని పదే పదే పెళ్లిచేసుకోవాలని సాయి ని ఇబ్బంది పెట్టడం తో ముందుగానే ప్లాన్ చేసుకొని హతమార్చలని అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లాడు. నిందితుడుకు 17 సంవత్సరాలు ఉండడం తో పేరు చెప్పడానికి పోలీస్ లు నిరాకరించారు.
రెండు నెలల క్రితం కూడా చాందిని ని సాయి కిరణ్ రెడ్డి అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లాడు.6 నుంచి 10 తరగతి వరకు చాందిని & సాయి కలిసి చదువుకున్నారు.తర్వాతా ఇద్దరు వేరే వేరే కాలేజ్ లలో చదువుతూనే ప్రేమించుకున్నారు.ఈ నెల 1 నుండి 3 వరకు సెంట్రల్ కోర్ట్ హోటల్ లో 52 మంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి గెట్ టు గెదర్ అయ్యారు. ఈ ఫెస్టివల్ కు చాందిని తో పాటు సాయి కూడా వెళ్ళాడు.
ఉదయం అంతా స్టడీ కి సంబందించిన అంశాల పై చర్చ ఉంటుంది. తరవాత అమ్మాయిలు అబ్బాయిలు సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. వీరిలో ఎక్కువగా ఆల్కహాల్ కూడా సేవించారు. ఫెస్టివల్ లో చాందిని షోహెల్ తో కలిసి సరదాగా ఉండడం తో సాయి అనుమానం పెంచుకున్నాడు.9 వ తేదీన షాహిల్ తో కలిసి పబ్ కు వెళ్లేందుకు చాందిని ప్లాన్ చేసుకుంది.కానీ సాయి కిరణ్ పిలవడం తో పబ్ కు రావడం లేదని షాహిల్ కు చాందిని టెక్స్ట్ మెసేజ్ చేసింది.అనుమానం పెంచుకున్న సాయి గుట్టల్లోకి తీసుకెళ్లకా చాందిని తో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగి ఇద్దరు కొట్టుకున్నారు.ముందుగానే ప్లాన్ చేసుకున్న సాయి గొంతు నులిమి చాందిని ని చంపి గుట్టల్లోకి పడేసాడు.
సోషల్ మీడియా ప్రభావం అంటున్న సిపి
సోషల్ మీడియా సమాజం లో వికృతమైన తీవ్ర ప్రభావం చూపుతోంది. పార్టీ లు పబ్ లంటూ విపరీత పోకడలకు పోతున్నారు.సెంట్రల్ క్లబ్ లో జరిగిన ప్రొగ్రమ్ కు ఒక్కో విద్యార్థి నుండి 3 వేల రూపాయలు తీసుకున్నారు. 56 మంది విద్యార్థుల నుండి హోటల్ సిబ్బంది కలెక్ట్ చేశారు.మైనర్ అబ్బాయిలు అమ్మాయిలకు హోటల్ లో రూమ్ లు ఇచ్చారు, లిక్కర్ సప్లయ్ చేశారు.తల్లిదండ్రులు కూడా పిల్లల పై శ్రద్ద పెట్టాలి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి చేస్తున్నారని చూడాలి. కాలేజ్ యాజమాన్యం కూడా స్టూడెంట్స్ పార్టీ లు చేసుకుంటుంటే పట్టించుకోలేదు. కాలేజ్ లు కూడా దృష్టి పెట్టాలి.