
తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద జోరుగా తిరుగుబాటు నడుస్తూ ఉంది. అయితే, తిరుగుబాటు చేస్తున్నవారిలో ఎక్కువ ఆయన రెడ్డి కులానికిచెందిన వారు. మిగతా కులాల వాళ్లున్నా, వాళ్ల గోలంతాలోలోనే.
ఉత్తమ్ ను పిసిసి అధ్యక్ష పదవినుంచి తీసేయాలంటున్నారంతా. ఆ పోస్టు మాకివ్వాలని నిర్మొహమాటంగా అంతా డిమాండ్ చేస్తున్నారు. అక్కడే గొడవంతా.
కాకపోతే, కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం కొద్దిగా ట్విస్ట్ ఇచ్చారు, తమ తిరుగుబాటుకి. మాకు ఒక ఏడాది చాన్స్ ఇవ్వండి అని ఓపెన్ గా అడుగుతున్నారు. ఒక వేళ మాకివ్వకపోతే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మరొక నేతకివ్వండని మెలికపెడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొననినాయకులెవరైనా పార్టీలో ఉన్నారా? పార్టీలో ఉంటూనే పోరాటం చేస్తామని, పార్టీ మారమని సీనియర్ కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. అంతేకాదు, ఉత్తమ్ ని పదవినుంచి తీసేయకపోతే, వచ్చే ఎన్నికల్లో పోటీచేసేది లేదని కూడా ప్రతిజ్ఞ చేశారు.
ఉత్తమ్ మీద గుర్రుగా ఉన్నవాళ్లలో ప్రతిపక్షనాయకుడు కె జానారెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే డికె అరుణ, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి లు కూడా ఉన్నారు. వీరుకాక మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ కూడా ఆయన మీద అసంతృపిగా ఉన్నారని చెబుతారు. కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ కూడా అన్ హ్యీపీయేlనట. ఆయన మైనారిటీ కోటా కింద పిసిసి అధ్యక్ష పదవి కాంక్షిస్తున్నారని పార్టీ టో బాగా టాక్. ఇంత మంది వ్యతిరేకిస్తున్నపుడు ఉత్తమ్ కొనసాగడం కష్టమనిపిస్తుంది. అయితే, కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తమ్ కు అండగా నిలబడింది. వీళ్ల తిరుగుబాటు ను లెక్క చేయడంలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారతారనే బెదిరింపు వార్తలొస్తున్నా లెక్క చేయడం లేదు. కారణం ఏమిటి?
కారణం సింపుల్, ఉత్తమ్ రాజకీయ నేపథ్యం. ఆయన ఎయిర్ పోర్స్ నుంచి వచ్చారు. రాజకీయాల్లో ఉంటూ మన్ను పూసుకోలేదు. పెద్ద వ్యాపారాల్లేవు. మెరిట్ మీదే ఉద్యోగం చేశారు. చాలా కాలం రాష్ట్రపతి భవన్ లో ఉన్నారు. అందుకే అవినీతి మరకలు అంటలేదు. ఈ కారణానే టిఆర్ ఎస్ పాలన మీద గట్టిగా మాట్లాడే నైతిక హక్కు ఆయన బలంగా ఉందని హైకమాండ్ అభిప్రాయపడుతున్నదని పార్టీ సీనియర్ నాయకులొకరు ఏషియానెట్ కు తెలిపారు. మరీ ముఖ్యంగా ఇపుడు తిరుగబడుతున్న వారంతా పిసిసి అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్నవారే. మెజారిటీ గా రెడ్డిలే. బిసి, ఎస్సి, ఎస్టీ వర్గాల నుంచి ఉత్తమ్ మీద ఫిర్యాదులు లేకపోవడం ఉత్తమ్ కు బాగా కలిసొచ్చింది. ఇక పార్టీ కార్యక్రమాల మీద హైకమాండ్ సంతృప్తిగానే ఉంది. తెలంగాణా లో పార్టీ టిఆర్ ఎస్ అక్రమాల మీద మంచి ఫైట్ ఇచ్చిందని భావిస్తున్నది. కాంగ్రెస్ పార్టీని ఎపుడూఏదో ఒక ఉద్యమంలోనో, యాత్రలోనో ఉత్తమ్ బిజీగా ఉంచాడని హైకమాండ్ కు రిపోర్టులున్నాయి. అందుకే కోమటి రెడ్డి బ్రదర్స్ బహిరంగ దాడినిగాని, డికె అరుణ, షబ్బీర్, జానా రెడ్డిల పరోక్షపితూరీలను గాని హైకమాండ్ సీరియస్ గా తీసుకోవడం లేదు. అంతా దారికొస్తారనే ధైర్యాంగా ఢిల్లీ నాయకత్వం ఉంది. అయితే, నాయకత్వం మెడలు వంచేందుకు అసమ్మతి వాదులు ఉత్తమ్ మీద దాడి ఉధృతం చేస్తారని, అది పార్టీకి హాని చేస్తుందనే భయాందోళన హైకమాండ్ లో ఉన్నట్లు తెలిసింది. ఉత్తమ్ మీద ఇలా అసంతృప్తి వ్యక్తం కావడం వెనక టిఆర్ ఎస్ హస్తముందేమోననే అనుమానాలు కూడా హైకమాండ్ లో ఉన్నాయి.
అయితే, కాంగ్రెస్ లో తిరుగుబాటు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అసంతృప్తి, పిసిసి నాయకత్వం మారే వార్తలను పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ మల్లు రవి ఖండించారు. ‘ఇవన్నీ పార్టీలో ఉన్న అభిప్రాయ బేధాలే తప్ప తిరుగుబాట్లు కాదు. కాంగ్రెస్ లో ఎపుడూ ఇలాంటివి ఉన్నాయి. పార్టీ ముందుకు పోతూనే ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పిసిసి టిఆర్ ఎస్ ప్రభుత్వం దుష్టపాలనన ప్రజలముందు పెట్టడంతో విజయవంతమయింది. దీనికి కారణం పార్టీ సమిష్టి గా పోరాడటమే. అదే కొనసాగుతుంది. పిసిసి పనితీరు మీద హైకమాండ్ సంతృప్తి తా ఉంది. వచ్చే ఎన్నికలలో 75 నుంచి 80సీట్ల దాకా కాంగ్రెస్ గెలుస్తుంది,’ అని ఆయన చెప్పారు. ఈ లక్ష్యం సాధించేందుకు కాంగ్రెస్ ఐక్యంగా సన్నద్దమవుతూ ఉందని కూడా డాక్టర్ రవి వెల్లడించారు.