
కట్నదాహం మరో యువతిని బలి తీసుకుంది. పెళ్లయిన 9 నెలలకే ఆ యువతి వల్లకాటికి చేరిందంటే కట్న దాహమే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.
వరంగల్ అర్బన్ జిల్లాలోని ధర్మసాగర్ మండలం, మల్లక్ పల్లి గ్రామానికి చెందిన దేవురుప్పుల అనుష (22) ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
అయితే ఈ అనూషకు పెళ్లయి 9 నెలలే అయిందని, అంతలోనే అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు.