రేవంత్ బ్రదర్స్‌‌కు బిగుస్తున్న ఉచ్చు: బాధితుల ఫిర్యాదులు, ప్రభుత్వం సీరియస్

Siva Kodati |  
Published : Mar 01, 2020, 08:19 PM ISTUpdated : Mar 02, 2020, 05:42 PM IST
రేవంత్ బ్రదర్స్‌‌కు బిగుస్తున్న ఉచ్చు: బాధితుల ఫిర్యాదులు, ప్రభుత్వం సీరియస్

సారాంశం

తమ భూములను రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి భయపెట్టి, బలవంతంగా లాక్కున్నారని పలవురు రంగారెడ్డి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నగర శివారులో విలువైన భూములు కావడంతో..... ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది.

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుల భూ కబ్జాపై వరుస ఫిర్యాదుల వ్యవహారం తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. తమ భూములను రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి భయపెట్టి, బలవంతంగా లాక్కున్నారని పలవురు రంగారెడ్డి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నగర శివారులో విలువైన భూములు కావడంతో..... ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది.

ప్రాథమికంగా అందిన సమాచారంపై విచారణ చేయించిన ప్రభుత్వం అందుకు బాధ్యులుగా ఓ అధికారిని గుర్తిస్తూ ఇప్పటికే చర్యలు కూడా చేపట్టింది. దీని తర్వాత బాధితుల సంఖ్య మరింతగా పెరిగింది.

Also Read:అప్పుడు నా వయస్సు నిండా పదహారే: భూ కుంభకోణంపై రేవంత్ రెడ్డి

దళితులు ఏర్పాటు చేసుకున్న ఓ సొసైటీకి సంబంధించిన భూముల విషయంలో అనుముల సోదరులు తమను మోసం చేశారని రాజేంద్రనగర్ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారన్న కారణంగానే తనపై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎంపీ రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది.  రేవంత్ బ్రదర్స్‌పై వచ్చిన ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించి లోతుగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:రేవంత్ కు గోపనపల్లి భూముల ఉచ్చు: వెనుక కథ ఇదీ

ఇప్పటికే పలు వివాదాలకు సంబంధించి ఫిర్యాదులు రావడం... గతంలో పలు  భూవివాదాల్లో  అనుముల సోదరులు జోక్యం చేసుకున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే సమయంలో మియాపూర్ భూముల కుంభకోణం కూడా మరో సారి తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్