తెలంగాణలో రెండో రోజు మోడీ టూర్: రూ.7,200 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించించనున్న ప్రధాని

By narsimha lode  |  First Published Mar 5, 2024, 10:04 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండో రోజున తెలంగాణలో పర్యటించనున్నారు.నిన్న ఆదిలాబాద్ లో మోడీ పర్యటించారు. ఇవాళ సంగారెడ్డిలో  ప్రధాని  పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
 



హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన  మంగళవారం నాడు కూడ కొనసాగనుంది. ఇవాళ  సంగారెడ్డిలో  రూ. 7, 200 కోట్ల విలువైన పలు పనులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.  అనంతరం బీజేపీ సభలో ఆయన పాల్గొంటారు.సోమవారం నాడు ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి  56 వేల కోట్ల విలువైన పనులను మోడీ ప్రారంభించారు. ఇవాళ  సంగారెడ్డి కేంద్రంగా   రూ. 7,200 కోట్ల పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మోడీ పాల్గొంటారు.

65 నెంబర్ జాతీయ రహదారి  పుణె - హైదరాబాద్ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు మోడీ.161 నెంబర్ జాతీయ రహదారి   కంది - రాంసాన్ పల్లి నాలుగు లైన్ల రోడ్డును మోడీ జాతికి అంకితం చేస్తారు.  167 జాతీయ రహదారికి చెందిన  మిర్యాలగూడ - కోదాడ అప్‌గ్రేడేషన్‌తో 2 లైన్ల పేవ్డ్ షోల్డర్ రహదారి నిర్మాణాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

Latest Videos

also read:ఆదిలాబాద్‌లో మోడీ టూర్: రూ. 56 వేల కోట్లతో పలు పనులను ప్రారంభించిన ప్రధాని

 సనత్‌నగర్ - మౌలా అలి మార్గంలో  రైల్వే డబ్లింగ్, విద్యుద్దీకరణతోపాటు  ఆరు కొత్త స్టేషన్ల భవనాలను మోడీ ప్రారంభిస్తారు.  పారాదీప్ - హైదరాబాద్ పైప్‌లైన్, ఘట్‌కేసర్ - లింగంపల్లి వయా మౌలా అలి - సనత్‌నగర్ మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలు సర్వీస్‌ని జెండా ఊపి ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.65 నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించే పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు.   సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనగూడ వరకు రూ.1298 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. జాతీయ రహదారి 765పై రూ. 399 కోట్లతో  విస్తరణ పనులను చేపట్టనున్నారు.  మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, రూ. 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు.

 


 

click me!