పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికలను కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు.
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్దం చేస్తున్నారు కేసీఆర్. భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.పార్టీ శ్రేణుల్లో భవిష్యత్తుపై భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
also read:యజమానిని చూసి గంతులేసిన కుక్క: సోషల్ మీడియాలో వైరలైన వీడియో
undefined
పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు. ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ ఎన్నికలకు నేతలను సమాయత్తం చేస్తున్నారు.
also read:అదే కొంపముంచింది: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో బీఆర్ఎస్ కు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు పార్టీని వీడారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన సమయంలో చోటు చేసుకున్న సందర్భాలను కేసీఆర్ గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన విషయాలను ఆయన గుర్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు మరిచిపోరని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిన విషయమై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు.
also read:పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
పార్లమెంట్ ఎన్నికలను ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నుండి ప్రారంభించనున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా రోడ్ షోలు, బస్సు యాత్రలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ నెల 12న కరీంనగర్ సభ తర్వాత రోడ్ షోలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టనున్నారు.
బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరారు. నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. పార్టీని వీడిన వారితో నష్టం లేదని కేసీఆర్ పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. పెద్దపల్లిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దింపనుంది బీఆర్ఎస్. నాగర్ కర్నూల్, జహీరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల కోసం ఆ పార్టీ నాయకత్వం అన్వేషణ ప్రారంభించింది.