అత్తాపూర్ లో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు...

By SumaBala Bukka  |  First Published Apr 11, 2023, 11:10 AM IST

ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఈ ఘటన కలకలం రేపింది. పిల్లర్ నెం. 133 దగ్గర ఇది జరిగింది.


హైదరాబాద్ : హైదరాబాద్ లోని అత్తాపూర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అత్తాపూర్ 133 పిల్లర్ దగ్గర జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ మహిళ ఎవరు? ఎందుకు ఆమె మీద దాడి జరిగింది అనే దానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా, ప్రేమించిన మహిళ  పెళ్లి చేసుకోమని గట్టిగా అడగడంతో దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రియుడు. గర్భవతి అని కూడా చూడకుండా ఆమె మీద పెట్రోల్ పోసి దహనం చేశాడు.  ఈ ఘటన నాగర్ కర్నూల్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.పెళ్లి చేసుకోమని ప్రియురాలు ఒత్తిడి తెస్తుండడంతో శ్రీశైలంలో చేసుకుందామని తీసుకువెళ్లి.. నల్లమల అడవుల్లో దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చేశాడు. దీనికి సంబంధించి జడ్చర్ల సిఐ రమేష్ బాబు వివరాలను తెలిపారు..

Latest Videos

గవర్నర్ల తీరుపై కేటీఆర్ ట్వీట్.. అత్యున్నత పదవులు రాజకీయ సాధనాలుగా మారాయంటూ ఆగ్రహం...

ఈ ఘటనలో బాధితురాలు లక్ష్మీ అలియాస్ రత్నమ్మ (34)  నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం గొరిట నివాసి. ఆమెకు అంతకుముందే వివాహమయ్యింది. గొడవల కారణంగా  మూడేళ్ల క్రితం భర్తతో విడిపోయి దూరంగా ఉంటుంది. జీవనం గడవడం కోసం కూలీ పనులకు వెళుతుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన లింగన్  చెన్నయ్యతో పరిచయం ఏర్పడింది.  అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. 

ఈ క్రమంలోనే చెన్నయ్య మరో యువతిని వివాహం చేసుకున్నాడు.  తనతో సంబంధం పెట్టుకుని మరో యువతిని ఎలా వివాహం చేసుకుంటావ్ అంటూ లక్ష్మి గొడవ పడింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో ఆ సమయంలో అతను లక్ష రూపాయల జరిమానా చెల్లించాడు. నిరుడు చెన్నయ్య భార్య గర్భిణి అయ్యింది.  ఆ సమయంలో మళ్ళీ లక్ష్మీ దగ్గరికి వచ్చాడు. ప్రస్తుతం లక్ష్మి కూడా గర్భం దాల్చింది. 

ఏడు నెలల గర్భంతో ఉండడంతో తనను పెళ్లి చేసుకోవాలని  లక్ష్మీ పట్టు పట్టింది. తన పేరిట రెండు ఎకరాల భూమి రాసి ఇవ్వాలని కోరింది. లేకపోతే, గ్రామంలోకి వచ్చి గొడవ చేస్తానని చెన్నయ్య మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో విసిగిపోయిన చెన్నయ్య ఎలాగైనా ఆమెని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.నువ్వు అడిగినట్టే పెళ్లి చేసుకుందామని శ్రీశైలానికి తీసుకువెళ్లాడు. ఈ ప్రకారం ఫిబ్రవరి 28న జడ్చర్ల నుంచి  బైక్ మీద  ఇద్దరు వెళ్లారు. దారిలో  ఫరహాబాద్ - మన్ననూర్ మధ్యలో ఉన్న తాళ్లచెరువు దగ్గర నుంచి నల్లమల అడవిలోకి తీసుకువెళ్లాడు. 

ఆమె ఏదో అడిగేలోపే కర్రతో తల మీద భారీ గొంతు నులిమి చంపేశాడు. ముందే  వేసుకున్న పథకం ప్రకారం బైక్ లో ఉన్న పెట్రోల్ తీసి ఆమె  మృతదేహంపై పోసాడు. ఆ తర్వాత నిప్పంటించి కాల్చేశాడు.

click me!