
అత్యున్నత రాజకీయ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్వానాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల విషయంలో కేంద్రం చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. దేశం అభివృద్ధి చెందడానికి సహాయపడే సహకార సమాఖ్య నమూనా ఇదేనా? టీమ్ ఇండియా స్ఫూర్తి ఇదేనా? అంటూ విరుచుకుపడ్డారు.