మణికొండలో డ్రైనేజీలో పడి వ్యక్తి గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

By telugu teamFirst Published Sep 26, 2021, 10:11 AM IST
Highlights

మణికొండలో దుర్ఘటన చోటుచేసుకుంది. కొన్నాళ్లుగా కురుస్తున్న వర్షానికి గోల్డెన్ టెంపుల్ ఎదురుగా జరుగుతున్న డ్రైనేజీ వర్క్ జరుగుతున్నట్టు తెలియకుండాపోయింది. సైన్ బోర్డులు మినహా ఇతర ఏర్పాట్లేమీ లేకపోవడంతో ఓ వ్యక్తి అటువైపుగా నడచుకుంటూ వెళ్లి డ్రైనేజీలో పడి గల్లంతయ్యారు. అధికారులు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదు.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) మణికొండ(Manikonda) ఏరియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజీ(Drainage)లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యారు(Missing). అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కానీ, ఆ వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు. 

మణికొండ ఏరియాలోని గోల్డెన్ టెంపుల్ ముందు కొన్నాళ్లు డ్రైనేజీ వర్క్ జరుగుతున్నది. కొన్నాళ్లుగా ఇక్కడ పనిజరుతున్నా.. అక్కడ సైన్ బోర్డులు తప్పా మరేమీ ఏర్పాటు చేయలేదు. దీంతో వర్షాలు ఎక్కువగా కురవడంతో ఆ సైన్ బోర్డులూ కొట్టుకుపోయాయి. వరదల ప్రవహిస్తుండటంతో అక్కడ డ్రైనేజీ వర్క్ జరుగుతున్నదన్న విషయమే తెలియకుండా పోయింది. అలా వరదలో అటువైపుగా వెళ్లిన ఓ వ్యక్తి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయారు.

అక్కడ కనీసం మూడు నెలల నుంచి వర్క్ జరుగుతున్నదని స్థానికులు చెప్పారు. కానీ, జాగ్రత్తగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. శనివారం నాలా వర్క్ చేసిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్త సూచనలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఈ విషయాన్ని పాదాచారలు గమనించకుండానే నడుస్తున్నారు. నాలా ముందున్న ఇంటిలో ఓ వ్యక్తి వరదను వీడియో తీస్తున్నాడు. అప్పుడే ఓ వ్యక్తి ఆ డ్రైనేజీలో పడినట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు విషయాన్ని అందించాడు. వెంటనే పోలీసులు, డీఆర్ఎఫ్, మున్సిపల్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఆచూకీ తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

 మణికొండ మున్సిపల్ కమిషనర్ జయంత్ ఈ ఘటనపై స్పందించారు. తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. వర్షం రావడంతో పని జరుగుతున్న ప్రాంతంలో మట్టి కొట్టుకుపోయి ఉంటుందని, అందువల్లే నాలా ఉన్నట్లు ఎవరికీ తెలియలేదని తెలిపారు. కాగా, స్థానికులు మాత్రం అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ మూడు నెలల నుంచి పని జరుగుతున్నదని, కానీ, ఎలాంటి బోర్డులు పెట్టలేదని వివరించారు. 

click me!