గులాబ్ తుఫాను ఎఫెక్ట్... నేడు, రేపు తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు

By Arun Kumar PFirst Published Sep 26, 2021, 7:59 AM IST
Highlights

గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

హైదరాబాద్: బంగాళా ఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను (Gulab Cyclone) ప్రభావంతో తెలంగాణలో (Telangana) ఈ రెండురోజులు(ఆది, సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగతాచోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించారు. 

శనివారం కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో నిన్న సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఇప్పటికే నదులు,వాగులు వంకలు పొంగిపొర్లుతూ ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నారు. జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.  

read more  హైదరాబాద్‌లో కుండపోత వర్షం: బయటకు రావొద్దు.. ప్రజలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక

మరో తెలుగురాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ పై ఈ గులాబ్ తుఫాను ప్రభావం ఎక్కువగా వుండనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు తుఫాన్ హెచ్చరికలను జారీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోనూ గులాబ్ తుఫాన్ ప్రభావముందని చెప్పడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యల్లో తలమునకలయ్యారు.

తుఫాన్ సమయంలో తీరంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని ఐఎండీ అంచనా వేసింది. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని... సోమవారం సాయంత్రానికల్లా తుఫాన్ మళ్లీ అల్పపీడనంగా మారిపోతుందని తెలిపింది.  

రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది. తుపాను ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు చోట్ల భారీ వానలు కురిశాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్నులో 12.3 పోచంపల్లి (కరీంనగర్​)లో 6.3, కూనారం (పెద్దపల్లి)లో 6, ఆవునూరు (రాజన్న సిరిసిల్ల జిల్లా)లో 6, సంగారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు చెప్పారు.  

click me!